Saturday, September 19, 2026 03:09 PM
Saturday, September 19, 2026 03:09 PM

టీడీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..!

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఒక అద్భుతమైన, అరుదైన ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, పేదరికాన్ని జయించి టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. చదువులో రాణించిన విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో, నియోజకవర్గ టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున భూమిని కానుకగా ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు.

Also Read : మద్యం సేవించి సభకు వచ్చిన సీఎం..?

ఈ అరుదైన నజరానాకు కుంటిపూడికి చెందిన జస్మిత, శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన సాయి పూజిత, మరియు తొండమనాడుకు చెందిన మోహిత్ చరణ్ ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏమాత్రం తక్కువ కాదని, సరైన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని ఈ విద్యార్థులు నిరూపించారని ఎమ్మెల్యే కొనియాడారు. వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతోనే ఈ భూమిని కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.

Also Read : బ్రేకింగ్: డిప్యూటి సీఎం పవన్‌ ఇంటికి చంద్రబాబు..!

సాధారణంగా విద్యార్థులకు నగదు బహుమతులు లేదా లాప్టాప్‌లు వంటివి ఇవ్వడం చూస్తుంటాం. కానీ, ఏకంగా నివాస స్థలాలను బహుమతిగా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం సదరు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనివ్వడమే కాకుండా, మిగిలిన విద్యార్థుల్లో కూడా చదువుపై మరింత ఆసక్తిని, పట్టుదలను పెంచుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ చొరవపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్