Wednesday, August 5, 2026 11:37 AM
Wednesday, August 5, 2026 11:37 AM

బ్రేకింగ్: డిప్యూటి సీఎం పవన్‌ ఇంటికి చంద్రబాబు..!

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పలు వ్యక్తిగత, రాజకీయ పరామర్శల నిమిత్తం ఆయన ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ లో చంద్రబాబు పర్యటన ఉండనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, చంద్రబాబు ఉదయం 10 గంటలకు నందగిరి హిల్స్ చేరుకోనున్నారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ సిరామిక్స్‌ అధినేత డాక్టర్ జి.ఎన్. నాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

Also Read : హోటల్ తిండి సామాన్యుడికి ఇక గగనమే..?

ఏప్రిల్ 29 న ఆయన హైదరాబాద్‌ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయనతో సిఎం చంద్రబాబుకు సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇక అనంతరం, సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాసానికి వెళ్లనున్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇటీవలశస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం హైదరాబాద్‌ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.

Also Read : మద్యం సేవించి సభకు వచ్చిన సీఎం..?

వైద్యుల సూచన మేరకు దాదాపు వారం నుండి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ కు, ప్రభుత్వం, కూటమి తరపున చంద్రబాబు తన మద్దతును తెలపనున్నారు. వీరిద్దరి భేటీలో ఆరోగ్య విషయాలతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు నందగిరి హిల్స్ మరియు పవన్‌ కల్యాణ్‌ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

పోల్స్