ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన పోలవరంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును యుద్ధప్రతిపాదికన పూర్తి చేసేందుకు కేంద్రం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. తాజా పరిణామాల ప్రకారం, 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును వందకు వంద శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పనుల వేగాన్ని పెంచేందుకు కేంద్రం మరో రూ. 3,300 కోట్ల నిధులను విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది.
Also Read : బ్రేకింగ్: కృష్ణా జిల్లాలో భయపెడుతోన్న సముద్రం..!
ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తూ నిధులను సర్దుబాటు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ. 3,320 కోట్లు కేటాయించగా, పనుల పురోగతిని బట్టి తాజా కేటాయింపులు చేయడం గమనార్హం. ప్రాజెక్టు పనులు నిరంతరం కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 2,300 కోట్ల అడ్వాన్స్ నిధులను కూడా విడుదల చేసింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటి నుండి ఇప్పటివరకు కేంద్రం భారీ మొత్తంలో నిధులను రీయింబర్స్ చేస్తూ వస్తోంది.
Also Read : బ్రేకింగ్: డిప్యూటి సీఎం పవన్ ఇంటికి చంద్రబాబు..!
ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల కోసం ఈ నిధులు కీలకం కానున్నాయి. ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారిన డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, ఇతర సివిల్ పనులను గడువులోపు పూర్తి చేసేందుకు జలశక్తి శాఖ మరియు రాష్ట్ర నీటిపారుదల శాఖ సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. 2027 వేసవి నాటికి పనులు ముగించి, గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.

