“మసాజ్” కోసమే ఆ మంత్రి గారి సింగపూర్ పర్యటన..? ఆ మంత్రికి వయసు పై బడినా కూడా సోకులు మాత్రం తగ్గలేదనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. కుటుంబ వివాధాలతో ఎప్పుడు బజారున పడ్డారో.. అప్పుడే పరువు, ప్రతిష్టలు మంట గలిసిపోయాయి.. అయినా సరే.. ఆయన మాత్రం సిగ్గు పడటం లేదు. తనకు వయసు పై బడలేదని ఆ మంత్రి అనుకుంటున్నారేమో..! సోకులకు ఏమి తక్కువ లేదు.. అన్నింటికీ సొమ్ములుంటే చాలు కదా..! మంత్రి పదవిలో ఉన్నప్పుడు పరువుగా, గౌరవంగా ఉండాలి. కానీ ఆ మంత్రి గారికి అవేవీ ఉండవు.. ఎందుకంటే.. సీఎం చంద్రబాబు సదరు మంత్రిని గుడ్డిగా నమ్ముతున్నారనే ప్రచారం ఉంది. మంత్రి లోకేష్ కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే సదరు మంత్రి వర్యులు..ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
Also Read : మద్యం సేవించి సభకు వచ్చిన సీఎం..?
తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయనను చట్టసభకు ఎంపిక చేశారు చంద్రబాబు. అంటే సదరు మంత్రివర్యులు ఏ స్థాయిలో లాబీయింగ్ చేశారనేది అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్టీ ఓడిన తర్వాత సదరు మంత్రి గారు ఏపీలో కనిపించలేదు. సరిగ్గా ఎన్నికలప్పుడు మళ్లీ ఏపీలో అడుగు పెట్టారు. కూటమి హవా, వైసీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతే ఈయన గారెని ఎమ్మెల్యేగా గెలిపించాయి. మళ్లీ మంత్రి పదవి దక్కింది. అయితే సదరు మంత్రి గారు మాత్రం.. ఐదేళ్లు టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసిన ఓ రిపోర్టర్‌నే మళ్లీ దగ్గరకు తీశారు.
ఇక అసలు విషయం ఏమిటంటే.. ఈ మంత్రి గారికి మసాజ్ అంటే ఎంతో ఇష్టమట. అది కూడా చైనీస్ మహిళలు చేసే మసాజ్ లంటే మరి ఇష్టమటా..! అందుకే అయిన దానికి, కాని దానికి సింగపూర్ వెళుతుంటారనే మాట బాగా వినిపిస్తోంది. అధికారిక పర్యటన అయినా సరే.. ప్రైవేట్ టూర్ అయినా సరే.. మసాజ్ మాత్రం కంపల్సరీ అంటున్నారు. నలుగురితో సింగపూర్ టూర్‌కు వెళ్లినప్పుడు కూడా మధ్యలోనే మాయమైపోతారంట. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారు.. ఏం చేశారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదంటున్నారు. చాలా జాగ్రత్తగా, రహస్యంగా పని ముగించుకుని మళ్లీ తిరిగి వచ్చేస్తారని సదరు మంత్రిగారి గురించి డిస్కషన్.
సింగపూర్ టూర్‌లో మసాజ్ కోసం సొంత డబ్బును మంచినీళ్ల మాదిరి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లుగా.. తనను ఎవరూ గమనించలేదని అనుకున్నారంట. అయితే ఈ విషయం ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. ఈ మంత్రి గారి లీలలపై చంద్రబాబు, లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి రాజకీయాల్లో ప్రస్తుతం సుద్దపూసలు ఎవరూ లేరు. ఎవరి బలహీనతలు వారివి. అయితే ఇవే వారిని ప్రజల్లో చులకన చేస్తాయి. వాటి వల్ల సదరు నేతతో పాటు పార్టీకి కూడా కావాల్సినంత చెడ్డపేరు వస్తుంది. ఇందుకు ప్రధాన ఉదాహరణ అంబటి రాంబాబు సంజన, సుకన్య వ్యవహారం. అవంతి శ్రీనివాస్ గంట, అరగంట బాగోతం. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ దరిద్రం. వైసీపీ ఓటమికి ఇవన్నీ పరోక్షంగా కారణమయ్యాయి.
Also Read : వైరల్ అవుతున్న 30 ఏళ్ల నాటి న్యూస్ పేపర్..!
తాజాగా మంత్రి గారి మసాజ్ వ్యవహారంపై అధినేత చంద్రబాబు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం సదరు మంత్రితో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు.. గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి గారు మాత్రం ఈ వార్నింగ్‌ను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం.. పార్టీకి తన అవసరం ఉందని.. ఆర్థికంగా పార్టీకి తాను అండగా ఉన్నా అనే ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే సదరు మంత్రిగారి మసాజ్ కథలు చంద్రబాబు వరకు చేరవేసింది ఎవరనే చర్చ జరుగుతోంది. ఇదంతా సహచర మంత్రి గారే పార్టీ అధినేతకు చెప్పినట్లు తెలుస్తోంది. తనతో పాటు గతంలో కూడా ఐదేళ్లు మంత్రిగా ఉన్న నేత.. ఇప్పుడు ఇలా ఎందుకు తన గుట్టు బయటపెట్టాడో ఆ మంత్రిగారికి అర్థం కావటం లేదంట.

