Saturday, September 19, 2026 04:18 PM
Saturday, September 19, 2026 04:18 PM

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..? పొలిటికల్ సర్కిల్స్‌ లో హాట్ టాపిక్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తిరిగి పార్టీలో యాక్టివ్ కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, ఇప్పుడు మళ్లీ వైసీపీలో కీలక పాత్ర పోషించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Also Read : వైసీపీ లో బోరుగడ్డ తిరుగుబాటు..కారణం అదేనా..?

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి, బీజేపీకి మధ్య సంబంధాలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో విజయసాయిరెడ్డికి ఉన్న బలమైన పరిచయాలు, రాజకీయ సంబంధాలు పార్టీకి ఇప్పుడు ఎంతగానో అవసరమని వైసీపీ భావిస్తోంది. ఆయన ద్వారా కేంద్ర పెద్దలతో మళ్లీ సత్సంబంధాలను పునరుద్ధరించుకోవచ్చని, ఇది పార్టీ పటిష్టతకు కూడా మేలు చేస్తుందని పార్టీ అంతర్గత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read : జగన్ పర్యటన దెబ్బ.. ధర్మాన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

అయితే, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటరీని ఉద్దేశించి విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కొందరు సీనియర్ నేతలు ఇప్పుడు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలోని ఒక వర్గం ఆయన పునరాగమనాన్ని స్వాగతిస్తుండగా, పాత విభేదాల దృష్ట్యా మరికొందరు నేతలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలో పాత ప్రాభవాన్ని దక్కించుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్