Friday, April 24, 2026 06:03 PM
Friday, April 24, 2026 06:03 PM

రంగంలోకి ఫేక్ గాళ్లు.. కూటమి సర్కార్ బీ అలర్ట్..!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే చాలు.. కొంతమందికి ఏ మాత్రం ముద్ద కూడా దిగదు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే కంటి నిండా నిద్ర కూడా పట్టదు. అందుకే ఎక్కడ లేని తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వంపైన బురద జల్లేందుకు నానా పాట్లు పడుతుంటారు. తెలుగుదేశం పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత వ చ్చేందుకు ఎంత నీచ స్థాయికి అయినా సరే దిగజారేందుకు రెడీ అంటారు. నిజానికి ఈ ఫేక్ ప్రచారం ఇప్పుడు మొదలైంది కాదు. 1999 నుంచి ఇదే తరహాలో వైఎస్ కుటుంబం చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంది. అప్పట్లో చంద్రబాబును వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవి కోసం టార్గెట్ చేస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నాడు.

Also Read : బీ అలర్ట్.. ముంచుకొస్తున్న ఎరువుల సంక్షోభం..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోసం ఎంత వరకు అయినా దిగజారుతారని గతంలోనే పలుమార్లు రుజువైంది కూడా. సొంత బాబాయ్ హత్య కేసులో నాటి ముఖ్యమంత్రి చేతుల్లో కత్తి పెట్టి నారా సుర రక్తచరిత్ర అంటూ తప్పుడు కథనం వండి వార్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ఇప్పుడు నిజానిజాలు బయటకు రావడంతో.. మా సొంత బాబాయ్ వ్యవహారంలో మీకేం సంబంధం అంటున్నారు వైసీపీ నేతలు. ఇక 2024 ఎన్నికల్లో గెలుపు కోసం మరోసారి కుట్రలు చేసి అడ్డంగా దొరికిపోయారు. విజయవాడలో ప్రచారం చేస్తున్న జగన్‌పై ఎవరో రాయి వేశారని.. టీడీపీ నేతలే జగన్ హత్యకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సరిగ్గా పోలింగ్ రోజు వరకు కంటికి ప్లాస్టర్ వేసుకుని సానుభూతి ఓట్లు పొందేందుకు తెగ తాపత్రయ పడ్డారు. చివరికి ఎవరూ రాయి విసరలేదని తేలడంతో వైసీపీ నేతలంతా ఉసూరుమన్నారు.

Also Read : అనంతబాబు ఎస్కేప్.. పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్..!

తాజాగా కూటమి సర్కార్ ప్రజలపై పన్నుల భారం వేస్తోందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ పార్కుల్లో నడవడంపై పన్ను.. అంటూ తప్పుడు ప్రచారం చేశారు. చివరికి జీవీఎంసీ పేరుతోనే తప్పుడు ఫ్లెక్సీలు పెట్టి మరి ప్రజలని మోసం చేసేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేతల కుట్రలకు కొందరు జీవీఎంసీ అధికారులు కూడా సహకరించారు. వైసీపీ మూకలు రాత్రి పూట ఫ్లెక్సీలు కడుతుంటే.. వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు.. సైలెంట్‌గా అక్కడ నుంచి వెళ్లిపోయారు. తెల్లారి వాకింగ్‌కు వచ్చిన ప్రజలు.. ఇదేంటని ప్రశ్నించడంతో.. జీవీఎంసీ కమిషనర్ వరకు ఈ అంశం చేరింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన కమిషనర్.. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించారు. తప్పుదారి పట్టించే ప్రచారాలని నమ్మవద్దని ప్రజలకు, వాకర్లకు సూచించారు. పార్కుల్లో నడకకు ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదని స్వయంగా కమిషనర్ క్లారిటీ ఇచ్చేశారు.

Also Read : అనంతలో లేడీ డాన్ రచ్చ.. షేక్ అవుతోన్న పోలీసు శాఖ..!

అయితే వైసీపీ అనుకూల సోషల్ మీడియా వేదికలు మాత్రం.. ప్రభుత్వంపై అదే తప్పుడు ప్రచారం పదే పదే చేస్తోంది. కమిషనర్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా వారి ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా భయపడిన కూటమి ప్రభుత్వం అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. తోలు తీస్తాం అంటూ ప్రజాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల ప్లేట్ మార్చేసిందని.. అసత్య ప్రచారం అంటూ చిలకపలుకులు పలుకుతూ యూటర్న్ తీసుకున్నారని రాసుకొచ్చారు. “ఓటమి భయం ఆమాత్రం ఉండాలి సుమీ!” అంటూ బరితెగించారు. ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారానికి కూటమి సర్కార్ బ్రేకులు వేయకుంటే.. భవిష్యత్తులో మరోసారి భారీ మూల్యం చెల్లించక తప్పదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అసలు బాబుకు లేని...

కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు...

రేవంత్ కొత్త మాస్టర్...

తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా...

మంగళగిరిలో ఐపీఎల్ జాతర.....

గత కొంత కాలంగా క్రీడలకు ప్రోత్సాహం...

ధోని దూరానికి కారణమేమిటి..?

మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు...

బ్రేకింగ్: ఏపీ మద్యం...

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా...

వాట్సాప్ యూనివర్సిటీపై సుప్రీం...

శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై...

పోల్స్