Friday, October 2, 2026 02:52 AM
Friday, October 2, 2026 02:52 AM

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్ సరదా పంచ్‌లు..!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల మధ్య ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర సరదా సంభాషణ సభలో అందరినీ ఆకట్టుకుంది. మంత్రి సత్యకుమార్‌కు ప్రత్యేకంగా బీజేపీ కండువా అవసరం లేదని, “మీరు బీజేపీ అని లోకమంతా తెలుసు కదా” అంటూ నారా లోకేష్ సభలో చమత్కరించారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కూడా తోడయ్యారు.

Also Read : ఇంటింటికి తెలుగుదేశం క్రేజీ రికార్డ్..!

“జాతీయ స్థాయిలో ప్రముఖ నేతల్లో సత్యకుమార్ గారు ఒకరు” అంటూ ప్రశంసించడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ సరదా సంభాషణ అక్కడితో ఆగలేదు. బీజేపీలో ఉండే పార్టీ క్రమశిక్షణను ప్రస్తావిస్తూ.. “మా పార్టీ వారికి కూడా కాస్త క్రమశిక్షణ నేర్పించండి సత్య గారు” అంటూ లోకేష్ మరో చమత్కారాన్ని విసిరారు. దీనికి స్పందించిన ఒక టీడీపీ ఎమ్మెల్యే వెంటనే “పార్టీ ఫస్ట్” అంటూ కలగజేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఈ సంభాషణ ప్రతిబింబించింది.

Also Read : నోటీసులకు జవాబు ఇవ్వాలి.. లేదంటే ఓటు ఔట్..!

టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించి సభను ఆకట్టుకున్నారు. “నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్” అంటే ముందు దేశం.. ఆ తర్వాతే పార్టీ.. స్వార్థం అనేది అందరికంటే చివరన.. అంటూ ఆయన ఇచ్చిన సమాధానంతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా నవ్వేశారు. పార్టీ క్రమశిక్షణతో పాటు దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక గొప్ప సందేశాన్ని సత్యకుమార్ ఈ సరదా మాటల్లోనే తెలియజేయడం విశేషం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

పోల్స్