Saturday, October 10, 2026 03:17 AM
Saturday, October 10, 2026 03:17 AM

సిరీస్ కోల్పోవడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..!

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో వైఫల్యాల పరంపర కొనసాగిస్తోంది. నాలుగో టీ20 మ్యాచ్‌ లో ఇంగ్లాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో టీ20 సిరీస్‌ ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటంతో 7 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 13.5 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఊదేసింది. అన్ని విభాగాల్లోనూ జట్టు దారుణంగా విఫలమవ్వడం పట్ల కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Also Read : పెద్ద ప్లాన్‌తోనే జగన్ గోదారి పర్యటన..!

వరుస సిరీస్ ఓటములపై మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ప్రస్తుత భారత జట్టు ఒక కీలకమైన ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో కొత్త ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని, ఇలాంటి సమయంలో తప్పులు జరగడం సహజమేనని అతను అభిప్రాయపడ్డాడు. పరిస్థితులకు అనుగుణంగా త్వరగా అలవాటు పడటం ఎంత ముఖ్యమో ఆటగాళ్లు గ్రహించాల్సి ఉందన్నాడు. జట్టులో త్వరగా నేర్చుకునే యువ ఆటగాళ్లు ఉన్నారని, ఈ పరాజయం నుండి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌ ల్లో బలంగా పుంజుకుంటామని అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Also Read : హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు అలర్ట్..!

తన వ్యక్తిగత స్కోరు 80 పరుగులు సంతోషాన్నిచ్చినప్పటికీ, జట్టు విజయానికి ఉపయోగపడనప్పుడు ఆ పరుగులకు విలువ ఉండదని ఆవేదన చెందాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తమ జట్టు ప్రదర్శనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ ఛాంపియన్స్ అయిన భారత జట్టుపై ఇలా వరుసగా మూడు మ్యాచ్‌ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల మధ్య ఉన్న బలమైన కమ్యూనికేషన్, పిచ్ పరిస్థితులకు అనుకూలంగా మారడమే తమ విజయానికి కారణమని బ్రూక్ పేర్కొన్నాడు. కాగా, శనివారం సౌతాంప్టన్‌ లో జరగబోయే చివరి టీ20 మ్యాచ్‌ లో కూడా ఇంగ్లాండ్ గెలిస్తే, భారత్‌ ను వెనక్కి నెట్టి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ లో ఇంగ్లాండ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్