Friday, May 22, 2026 04:17 PM
Friday, May 22, 2026 04:17 PM

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. మద్యం ధరల పెంపునకు సంబంధించి.. ఇప్పటికే కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మద్యం తయారీ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. కమిటీ సిఫార్సుల కంటే తక్కువగానే ప్రభుత్వం ధరలు పెంచనుంది. తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది.

Also Read : మీరు తేనెపూసిన కత్తులు.. జగన్ పై విరుచుకుపడ్డ పార్థసారథి రెడ్డి

త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో మందు, బీర్ల ధరలు పెరగనున్నాయని సమాచారం. తెలంగాణలో మద్యం ధరల పెరుగుదలకు సంబంధించి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ తర్వాత.. అన్ని రకాల మద్యం ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. మద్యం ధరలను పెంచాలని ఇప్పటికే తయారీ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో గతంలో పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన సమయంలోనే మద్యం ధరలను పెంచాలని మద్యం తయారీ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : చిదంబరం వర్సెస్ లోకేష్.. అదిరిపోయే కౌంటర్..!

అయితే యుద్ధం ఎఫెక్ట్ సీసాల తయారీపైనా పడటంతో.. వాటి ధరలు పెరిగాయి. ఇక మద్యం ధరలో సీసాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు రెట్టింపు కావడంతో సీసాల తయారీ ఖర్చు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వాటికి అనుగుణంగా ధరలను పెంచాలని కంపెనీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక అన్ని మద్యం బ్రాండ్లపై కనీసం 10 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపడుతోంది. దీంతో సాధారణ, మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు కూడా భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెంచిన మద్యం ధరల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆర్ధిక, అబ్కారీ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు.. మద్యం ధరల పెంపు ఆదాయ వనరులకు సంబంధించిన అధ్యయనం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలోనే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ఇప్పటికే సర్కార్కు కీలక ప్రతిపాదనలు అందించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

చిదంబరం వర్సెస్ లోకేష్.....

నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా,...

ఏపీలో రాజ్యసభ సందడి.....

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ...

షా దృష్టిలో చంద్రబాబు...

సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం...

మీరు తేనెపూసిన కత్తులు.....

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాత.....

ప్రొ. నాగేశ్వర్ అబద్ధాల...

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత...

పోల్స్