ఫ్రాన్స్‌లో జరగబోయే జీ7 సమ్మిట్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరు నేతలు నేరుగా భేటీ కాలేదు., వచ్చే నెల జూన్ 15-17 తేదీల్లో ఇవియాన్-లె-బైన్స్ లో జరిగే ఈ భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమ్మిట్ లో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటున్నారు.
Also Read : బెంగాల్‌లో బుల్‌డోజర్లు.. సువేందు భారీ ఆపరేషన్..!
ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలను ముగించడానికి ఈ సమావేశం ఒక కీలక వేదిక కానుంది. భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ ప్రభుత్వం గతంలో 25% అదనపు టారిఫ్‌లు విధించినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరి చర్చల తర్వాత వాటిని 18 శాతానికి తగ్గించారు. అయితే మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా నిలిచిపోయిన అధికారిక భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఈ భేటీలో ఒక తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఆహారాన్ని బాగా నములుతున్నారా..? అయితే మీ మెదడు సూపర్ షార్ప్..!
గతంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల క్రెడిట్ ను ట్రంప్ ఏకపక్షంగా క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించడం, అలాగే రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రధాని మోదీ లొంగకుండా తన వ్యూహాత్మక స్వతంత్ర విధానాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే సెప్టెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సమ్మిట్ కు రానున్నారు. ఒకవైపు అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే, మరోవైపు రష్యాతో సాంప్రదాయ బంధాన్ని భారత్ ఎలా సమతుల్యం చేయబోతోందనేది ఈ జీ7 సమ్మిట్ ద్వారా స్పష్టం కానుంది.

