Saturday, August 22, 2026 07:46 AM
Saturday, August 22, 2026 07:46 AM

బ్రేకింగ్: ట్రంప్.. మోడీ కీలక భేటీ షురూ..?

ఫ్రాన్స్‌లో జరగబోయే జీ7 సమ్మిట్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇరు నేతలు నేరుగా భేటీ కాలేదు., వచ్చే నెల జూన్ 15-17 తేదీల్లో ఇవియాన్-లె-బైన్స్‌ లో జరిగే ఈ భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమ్మిట్‌ లో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటున్నారు.

Also Read : బెంగాల్‌లో బుల్‌డోజర్లు.. సువేందు భారీ ఆపరేషన్..!

ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలను ముగించడానికి ఈ సమావేశం ఒక కీలక వేదిక కానుంది. భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ ప్రభుత్వం గతంలో 25% అదనపు టారిఫ్‌లు విధించినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరి చర్చల తర్వాత వాటిని 18 శాతానికి తగ్గించారు. అయితే మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా నిలిచిపోయిన అధికారిక భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఈ భేటీలో ఒక తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

Also Read : ఆహారాన్ని బాగా నములుతున్నారా..? అయితే మీ మెదడు సూపర్ షార్ప్..!

గతంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల క్రెడిట్‌ ను ట్రంప్ ఏకపక్షంగా క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించడం, అలాగే రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రధాని మోదీ లొంగకుండా తన వ్యూహాత్మక స్వతంత్ర విధానాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే సెప్టెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సమ్మిట్‌ కు రానున్నారు. ఒకవైపు అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే, మరోవైపు రష్యాతో సాంప్రదాయ బంధాన్ని భారత్ ఎలా సమతుల్యం చేయబోతోందనేది ఈ జీ7 సమ్మిట్ ద్వారా స్పష్టం కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

మాట జాగ్రత్త.. పార్టీ...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు...

పోల్స్