Saturday, August 22, 2026 07:46 AM
Saturday, August 22, 2026 07:46 AM

ఆహారాన్ని బాగా నములుతున్నారా..? అయితే మీ మెదడు సూపర్ షార్ప్..!

మనం తినే ఆహారం కేవలం శరీరానికే కాదు, మెదడు పనితీరుకు కూడా ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం వల్ల మెదడు ఉద్దీపన చెందడంతో పాటు మానసిక చురుకుదనం అద్భుతంగా పెరుగుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనం నమిలేటప్పుడు దవడ కండరాల కదలికలు మెదడులోని హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ వంటి భాగాలను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, రోజంతా అలసిపోకుండా అలెర్ట్‌ గా ఉండేందుకు సహాయపడుతుంది.

Also Read : అవును.. వాళ్లిద్దరు కలిశారు.. మరి వీళ్లిద్దరూ..?

బాగా నమలడం వల్ల శరీరంలో ఒత్తిడి రెస్పాన్స్ గణనీయంగా తగ్గుతుంది. మనం ఆహారాన్ని శ్రద్ధగా నమిలినప్పుడు దవడల నుంచి వెళ్లే సిగ్నల్స్ శరీరంలో పేరుకుపోయిన టెన్షన్‌ ను క్రమంగా దూరం చేస్తాయి. ఇది శరీరాన్ని మరియు మనస్సును మరింత ప్రశాంతమైన స్థితికి తీసుకువెళుతుంది. ఫలితంగా రోజూవారీగా ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు నమిలి తినే అలవాటు ద్వారా చాలా వరకు అదుపులోకి వస్తాయి. అంతేకాకుండా, నమలడం అనే ప్రక్రియ శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read : ముందస్తు ఎన్నికలకు రెడీ అవ్వండి: స్టాలిన్ సంచలనం..!

తిన్న ఆహారం సులభంగా జీర్ణం కావడంతో పాటు మెదడుకు రక్తప్రసరణ మెరుగ్గా సాగడానికి ఈ చిన్న అలవాటు ఎంతో దోహదపడుతుంది. అందుకే టీవీలు, మొబైల్స్ చూస్తూ గబగబా మింగేయడం కాకుండా, ప్రతి ముద్దను బాగా నమిలి ఆస్వాదించడం వల్ల అటు జీర్ణవ్యవస్థ, ఇటు మెదడు రెండూ సూపర్ హెల్తీగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మనం ఆహారాన్ని గట్టిగా, నమిలి తినేటప్పుడు దవడ కండరాల లయబద్ధమైన కదలికలు మెదడుకు ఒక రక్త పంప్ లాగా పనిచేస్తాయి. దీనివల్ల మెదడులోని కొన్ని కీలక భాగాలకు రక్తప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా దాదాపు 25% నుండి 28% వరకు పెరుగుతుందని స్కాన్లలో తేలింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

మాట జాగ్రత్త.. పార్టీ...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు...

పోల్స్