Friday, April 24, 2026 09:15 PM
Friday, April 24, 2026 09:15 PM

రేవంత్ కొత్త మాస్టర్ ప్లాన్.. కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుందా..?

తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నలుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కేవలం రాష్ట్ర స్థాయి విచారణలతోనే సరిపెట్టకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓ ప్రకటన చేసారు.

Also Read : పెట్రో మంట.. ఎన్నికలు పూర్తి కాగానే లీటరుకు రూ. 25..?

“నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తాం. కాళేశ్వరంపై నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో పాటు, ప్రాజెక్టు వైఫల్యాలు మరియు ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను సీబీఐకి అందజేస్తాం” అని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అంచనాల పెంపులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తోంది.

Also Read : బీ అలర్ట్.. ముంచుకొస్తున్న ఎరువుల సంక్షోభం..!

ఇప్పటికే విజిలెన్స్ విచారణ, పీసీ ఘోష్ కమిషన్ విచారణలు జరుగుతున్నప్పటికీ, ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చిన బ్యాంకులు, కేంద్ర సంస్థల ప్రమేయం ఉన్నందున కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారానే పూర్తి నిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు సీబీఐ విచారణ కోసం సిఎం పట్టుబట్టడం ఓ సంచలనమే. ఒకవేళ సీబీఐ రంగంలోకి దిగితే, అంచనాల మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల మళ్లింపు వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మంగ్లీ అండ్ టీమ్...

మంగ్లీ, శివ నాయక్, రామావత్ మధు,...

ఆ వైసీపీ ఎమ్మెల్సీ.....

వైసీపీకి రాజీనామా చేసి, జనసేన తీర్ధం...

అసలు బాబుకు లేని...

కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు...

మంగళగిరిలో ఐపీఎల్ జాతర.....

గత కొంత కాలంగా క్రీడలకు ప్రోత్సాహం...

ధోని దూరానికి కారణమేమిటి..?

మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు...

బ్రేకింగ్: ఏపీ మద్యం...

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా...

పోల్స్