Monday, April 20, 2026 11:07 PM
Monday, April 20, 2026 11:07 PM

పెయిడ్ ఆర్టిస్ట్ కోసం జగన్ ఆరాటం

ఇద్దరు ముఖ్యమంత్రులను దూషించిన వ్యక్తి పై చర్యలుండవా..? రోజు రోజుకు ఇష్టం వచ్చినట్లు, ఘోరాతి ఘోరంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న స్వయం ప్రకటిత మేధావి ఒకరు.. ముఖ్యమంత్రులను వాడు, వీడు అని హేళనగా మాట్లాడటం.. పోలీసు అంటే లెక్కలేనితనం.. పోలీస్ డీజీపీని కూడా ఫోన్‌లో బెదిరిస్తుంటే మౌనం వహిస్తున్న పోలీస్ యంత్రాంగం. ఇతడేమన్న తెలంగాణ దావూద్ ఇబ్రహీమా..? చోట షకీల్, వీరప్పనా..? ప్రభుత్వ మౌనం దేనికి సంకేతం..? వాక్ స్వాతంత్రం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చా..? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ రావాలంటే అతని అనుమతి తీసుకోవాలా..? అసలు ఎవరితను..? ఎందుకింత నోటి దూల..? ఇంకా చెప్పాలంటే ఎందుకింత బలుపు..?

Also Read : అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు

ప్రజలకు ఏమైనా సమస్య వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. లేదా కోర్టుకు వెళతారు. కానీ ఓ పెద్దమనిషి మాత్రం అందరికీ తానే న్యాయం చేస్తా అంటున్నాడు. అన్నీ పంచాయతీలు నేనే తీరుస్తా అని బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ హైదరాబాద్ వస్తే.. పేడతో కొట్టిస్తాడంట. చెప్పులతో దాడి చేస్తాడంట.. ఇంతకీ ఇతనికి.. కాదు కాదు.. వీడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది..? అసలు వీడి వెనుక ఎవరున్నారు..? తాడేపల్లి ప్యాలెస్్ నుంచి అందుతున్న డబ్బు మహత్యమా..?.. పేరు కే.వెంకట్రామ్ రెడ్డి.. అలియాస్ కేవీఆర్.. వృత్తి జర్నలిజం అని చెప్పుకుంటాడు. వైసీపీని భుజాల మీద మోస్తున్న విషయం తెలుగు రాష్ట్రాల వారికే కాదు.. తెలుగు ప్రజలందరికీ తెలుసు.

కేవీఆర్‌ది పెయిడ్ బతుకు అనేది బహిరంగ రహస్యం. తెలంగాణను ఉద్దరిస్తున్నా.. అని ఆయనకు ఆయనే ప్రకటించుకున్నాడు. తెలంగాణ వాది అయితే తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని ఆస్తులు కూడబెట్టుకున్న జగన్ నుంచి ఆస్తులు తిరిగి ఇప్పించే దమ్ము ఉందా అనేది ఇప్పుడు తెలంగాణ వాదులు చేస్తున్న డిమాండ్. బ్రిటీష్ వాళ్లు 250 ఏళ్లు దేశం మొత్ లో దోచిన దానికి 100 రెట్లు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ సొమ్మును దోచుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఈ డ్రామాలు ప్రాంతీయ వాదం ముసుగు ఎందుకని నిలదీస్తున్నారు.

Also Read : విజయ్‌ ఆస్తుల పంచాయితీ.. మద్రాస్ హైకోర్టు షాక్..!

కేవీఆర్ పోరాటం ఏపీ కోసం కాదని.. కేవీఆర్ చేస్తున్న పోరాటం జగన్ అక్రమాస్తులు కాపాడేందుకు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో ఉన్న ఆస్తులకు 2009 ఎన్నికల అఫిడవిట్‌లో ఉన్న ఆస్తుల విలువకు అంత తేడా ఎలా వచ్చిందో తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారని.. అందుకే జగన్ మీద 16 ఛార్జ్‌షీట్‌లు వేశారన్నారు. 40 వేల కోట్ల ఆస్తులు జప్తు చేసిన మాటను గుర్తు చేశారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నది.. 13 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నది కూడా అక్రమాస్తుల కేసులోనే అని ఎద్దేవా చేశారు.
జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించే దమ్ము కేవీఆర్‌కు ఉందా నిలదీశారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ హైదరాబాద్ ఎలా వస్తారని కాదు.. అసలు జగన్ లోటస్ పాండ్‌కు ఎలా వస్తాడో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్ కట్టుకున్న రాజమహల్‌లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ప్రజల సొమ్మును జగన్ ఎలా దోచుకున్నాడో జర్నలిస్టు కేవీఆర్‌కు తెలియదా.. లేక కనిపించటం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని.. కాపలా కుక్క అంటూ మాయమాటలు చెప్పిన కేసీఆర్‌కు ఎలాంటి తీర్పు ఇచ్చారో చూడలేదా అని ఉదాహరించారు. జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాదికి తెలంగాణలో చోటు లేదని.. అలాంటి వ్యక్తికి తెరవెనుక చక్రం తిప్పే జర్నలిస్ట్ ముసుగేసుకున్న కేవీఆర్ లాంటి వారిని, తెలంగాణ సమాజం తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.

Also Read : షర్మిలపై మాజీ ఎమ్మెల్యే.. దారుణ కామెంట్..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు చంద్రబాబు లిఖిత పూర్వకంగా మద్ధతిచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు అంటే కనీస గౌరవ మర్యాద కూడా ఇవ్వకుండా.. నోటికి వచ్చినట్లుగా బూతులు తిడుతుంటే.. పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అలాంటి కేవీఆర్‌ను జగన్ స్వయంగా తన ఇంటికి పిలిపించుకుని సన్మానం చేయటం.. అలాంటి వ్యక్తి అరెస్టును తప్పుబడుతూ సోషల్ మీడియాలో పెద్ద లేఖ రాయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విజయ్‌ ఆస్తుల పంచాయితీ.....

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే...

బీఆర్ఎస్‌లో ముసలం.. హరీష్...

గులాబీ పార్టీలో ముసలం మొదలైందా..? జీవన్...

షర్మిలపై మాజీ ఎమ్మెల్యే.....

ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి...

అన్నం తింటే భరించలేని...

ఏపీ సిఎం చంద్రబాబు పుట్టిన రోజు...

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి...

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయానికి...

టార్గెట్ ధర్మాన, బొత్స.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి....

పోల్స్