Saturday, May 16, 2026 02:23 PM
Saturday, May 16, 2026 02:23 PM

అన్నకు కౌంటర్‌గా షర్మిల పాదయాత్ర..!

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు సిద్ధపడుతున్నారా..? అయితే ఇది అన్ని ప్రాంతాల్లో కాదా? కేవలం రాయలసీమకి ఆమె పాదయాత్ర పరిమితం కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాయలసీమకు అతి దగ్గరగా ఉండే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ సహకారంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. తెలంగాణలో రేవంత్ రూపంలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఈ మూడు రాష్ట్రాల సహకారంతో రాయలసీమపై గట్టి ప్లాన్ చేస్తున్నారు షర్మిల.

Also Read : పవన్ అడ్డా అదేనా.. ఎవరూ మార్చలేరా..?

రాయలసీమపై వైఎస్ఆర్ కుటుంబ ప్రభావం అధికంగా ఉండేది. ముఖ్యంగా కడప జిల్లాలో ఆ కుటుంబానికి తిరుగులేని రాజకీయ ఆధిపత్యం. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆ ప్రభావం పనిచేయలేదు. జగన్ మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్నారు. అందుకే కడప జిల్లాతో పాటు రాయలసీమపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే షర్మిల సైతం ఆ ప్రాంతంపై పట్టు బిగించేందుకు పాదయాత్రకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఆమె పాదయాత్ర ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.

మరోవైపు కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో షర్మిల బస్సు యాత్రకు సైతం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో పాదయాత్ర ముగిసిన వెంటనే బస్సు యాత్రకు సన్నాహాలు మొదలు పెడతారని సమాచారం. కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేసే విధంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా ఆమె పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది. అన్నింటికీ మించి వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పాటు మిగతా రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంటుంది జాతీయస్థాయిలో. ఇదే ఊపుతో రాయలసీమలో పట్టు బిగించడం ద్వారా.. 2029 ఎన్నికల్లో ఓట్లతో పాటు సీట్లు కూడా పొందాలని చూస్తోంది కాంగ్రెస్. అందుకే షర్మిల పాదయాత్రకు హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : ఇండియాలో ఈ కారుకు ఫుల్ క్రేజ్..!

మరోవైపు వచ్చే ఏడాది నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించారు. దీంతో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు ఇప్పటి నుంచే గంపెడాశతో ఉన్నారు. 2018లో జగన్ చేసిన పాదయాత్ర వల్లే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందనేది ఆ పార్టీ నేతల నమ్మకం. అందుకే జగన్ పాదయాత్ర ప్రకటన తర్వాత.. వైసీపీ నేతలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో షర్మిల పాదయాత్ర, బస్సు యాత్ర అంటు వార్తలు బయటకు రావడం.. అన్నకు కౌంటర్‌గా చేస్తున్నారా.. అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

నేడే బండి భగీరథ్...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పవన్ అడ్డా అదేనా.....

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతుకు...

మరో మాట నిలబెట్టుకున్న...

ఏపీలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలను...

పోల్స్