Wednesday, July 8, 2026 07:46 AM
Wednesday, July 8, 2026 07:46 AM

భూమన ఫ్యామిలీకి షాక్.. హడావుడి తగ్గుతుందా..?

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారడు అభినయ్ రెడ్డి ఇటీవలి కాలంలో చేస్తోన్న హడావుడిపై కాస్త ఆసక్తికర చర్చే జరుగుతోంది. ఈ తరుణంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కుటుంబానికి వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలో తిరుపతి రాజకీయాల్లో భూమన అభినయ్ రెడ్డి చేస్తున్న హడావుడి, ఆయన అనుచరుల మితిమీరిన ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Also Read : నేడే బండి భగీరథ్ అరెస్ట్..? షాక్ ఇచ్చిన హైకోర్టు..!

భూమన కుటుంబం తమ స్వార్థ రాజకీయాలు, అరాచకాలతో తిరుపతిలోని స్థానిక యువకుల జీవితాలతో ఆడుకుంటోందని మహిళలు ఆరోపించారు. ఈ నిరసనలకు ప్రధాన కారణం తిరుపతిలో గంజాయి సరఫరా చేస్తూ భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరుడైన భాను అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోవడమే. నగరంలో యువతను పెడదోవ పట్టిస్తూ, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న భానును తిరుపతి ఈస్ట్ పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.

Also Read : అర్ధరాత్రి టన్నెల్‌ లోకి.. తెల్లారితే ఢిల్లీకి.. నిమ్మల డెడికేషన్ కి ఫిదా..!

ఈ అరెస్టుతో భూమన అభినయ్ రెడ్డి చుట్టూ ఉన్న ముఠా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందో స్పష్టమైందని స్థానికులు మండిపడుతున్నారు. నిందితుడు భాను వెనుక ఉన్న పెద్ద తలకాయలను, ముఖ్యంగా అతనికి అండగా నిలుస్తున్న భూమన అభినయ్ రెడ్డిని కూడా ఈ కేసులో చేర్చి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా తిరుపతి నగరంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా భూమన అభినయ్ రెడ్డి చేస్తున్న హడావుడి మితిమీరిపోయిందని, అనుచరుల ముసుగులో ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్