Wednesday, July 8, 2026 06:29 AM
Wednesday, July 8, 2026 06:29 AM

నేడే బండి భగీరథ్ అరెస్ట్..? షాక్ ఇచ్చిన హైకోర్టు..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు అరెస్ట్ నుండి ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో, నేడే ఆయన అరెస్ట్ జరిగే అవకాశం ఉందనే ఉత్కంఠ నెలకొంది. భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ పై హైకోర్టులో నిన్న అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. బాధితురాలి స్టేట్మెంట్‌ ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవీదేవి, ఈ దశలో నిందితుడికి ఎలాంటి అరెస్ట్ స్టే ఇవ్వలేమని స్పష్టం చేస్తూ తదుపరి తీర్పును మే 21వ తేదీకి రిజర్వ్ చేశారు.

Also Read : చిన్న పిల్లలపైనే డెంగ్యూ దోమల దాడి.. ఎందుకో తెలుసా?

కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో, సైబరాబాద్ పోలీసులు ఏ క్షణమైనా భగీరథ్‌ ను అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన పేట్‌ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరవుతారా లేదా అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా భగీరథ్ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారని, ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయివుందని పోలీసులు ఇప్పటికే కోర్టుకు తెలియజేశారు.

Also Read : చిన్న పిల్లలపైనే డెంగ్యూ దోమల దాడి.. ఎందుకో తెలుసా?

ముందస్తు బెయిల్ వస్తుందనే ధీమాతో ఇంతవరకు విచారణకు రాని భగీరథ్, హైకోర్టు షాక్ ఇవ్వడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌ లో లొంగిపోతారా లేక ముందస్తు వ్యూహంతో పోలీసులు ఆయన్ని వెతికి పట్టుకుని అరెస్ట్ చేస్తారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. తీవ్రమైన పోక్సో సెక్షన్లు నమోదు కావడంతో పోలీసులు నేడే ఈ కేసులో కీలక అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. అటు రాజకీయంగా ఈ కేసు సంచలనం అయిన నేపధ్యంలో.. ఏ ఒత్తిడి లేకుండా.. విచారణ పూర్తి చేసే దిశగా ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్