Friday, April 24, 2026 09:01 PM
Friday, April 24, 2026 09:01 PM

మంగ్లీ అండ్ టీమ్ చేసిన స్కామ్ ఏమిటీ..?

మంగ్లీ, శివ నాయక్, రామావత్ మధు, హిమకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావు.. ఇటీవల ఎక్కడ చూసినా ఈ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతా వీళ్లు చేసిన స్కామ్ మీదే చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ స్కామ్ ఏమిటి? మంగ్లీకి ఇందులో నిజంగా ఏమైనా సంబంధం ఉందా? మోసపోయిన సాధారణ ప్రజలకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి.

మైక్రో ఫైనాన్స్ పేరుతో వీళ్లు చేసిన మోసం వల్ల వందలాది పేద కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా బాధాకరమైన పరిస్థితి. ఒకవేళ రామావత్ మధు, హిమకాంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారని భావిస్తే.. మంగ్లీ, ఆమె తమ్ముడు శివ వీరితో ఎందుకు సంబంధాలు కొనసాగించారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వాచ్‌మన్ రమేష్, మధు స్నేహితుడు తిరుమల్ చెప్పిన వివరాల ప్రకారం, మంగ్లీ, మధు, శివ పలుమార్లు కలుసుకున్నారని అంటున్నారు. అసలు వారి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి అనే అంశంపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Also Read : రంగంలోకి ఫేక్ గాళ్లు.. కూటమి సర్కార్ బీ అలర్ట్..!

రామావత్ మధు, అభిషేక్ నాయక్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంగ్లీకి ఏమైనా సంబంధం ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆమెకు సంబంధం లేకపోతే, సంబంధిత వ్యక్తులతో ప్రెస్‌మీట్ పెట్టించాలని ఎందుకు కోరుతున్నారనే ప్రశ్న కూడా ఉంది. ఎవరైనా తన పేరు దుర్వినియోగం చేస్తున్నారని భావిస్తే, దానిపై తగిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

సిమెంట్ ఫ్యాక్టరీ, రియల్ ఎస్టేట్, మైక్రో ఫైనాన్స్, ఫేక్ కంపెనీల పేర్లతో అధిక వడ్డీలు ఆశ చూపించి భారీగా డబ్బులు సేకరించారు. వీళ్ల మాయమాటలకు మోస పోయిన ప్రజలు ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయారు. ఇది చాలా బాధాకరమైన అంశంగా మారింది. సాధారణ ప్రజల నుంచి కోట్ల రూపాయలు సేకరించారు. సెలబ్రిటీ స్థాయి ఉందని ఎవరు ఏదైనా చేయవచ్చా? వ్యవస్థలు అందరికీ సమానంగా పని చేయవా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

మంగ్లీకి నిజంగా సంబంధం లేకపోతే, రామావత్ మధు ద్వారా వాస్తవాలను స్పష్టంగా చెప్పించవచ్చని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఆ అడ్వకేట్ సుబ్బారావును భయపెడుతున్నారు.? పొలిటికల్ లీడర్స్ పేర్లు చెప్పి ఎందుకు భయపెడుతుంది.? నిజం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో బాధితుల తరపున పోరాడతామని చెప్పిన మంగ్లీ, ఎందుకు ఈరోజు సైలెంట్‌గా ఉందనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఈ మోసగాళ్ల మీద పోలీసులు ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారన్నది ప్రజల ఆసక్తిగా మారింది.

Also Read : రేవంత్ కొత్త మాస్టర్ ప్లాన్.. కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుందా..?

ఇక్కడ మరో విషయం అస్సలు అర్థం కావటం లేదు. చట్టం అందరికీ సమానమే అనేది పోలీసులు పదే పదే చెప్తున్న మాట. మరి అందరూ సమానమే అయితే.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మంగ్లీ పట్ల ఒకలా.. అడ్వకేట్ సుబ్బారావు పట్ల మరోలా ఎందుకు ప్రవర్తించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేవలం డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మాత్రమే బ్లీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వస్తే.. స్టేషన్ ఆవరణలో అందరి ముందు పోలీసులు బ్లీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. అదే మంగ్లీ ఫిర్యాదు చేసేందుకు వస్తే.. ఏకంగా సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్.. తన సీటులో నుంచి లేచి నిలబడి.. ఫిర్యాదు తీసుకుంటున్నట్లు ఫోటోలు దిగి మరీ మీడియాకు రిలీజ్ చేశారు. చట్టం దృష్టిలో వీఐపీలకు ఓ న్యాయం, సామాన్యులకు మరో న్యాయమనే తేడా ఉంటుందా..?

ఒక్కటి మాత్రం నిజం, సామాన్యుల దగ్గర మోసం చేసి డబ్బు తీసుకున్నవాడు బానే ఉన్నాడు. బానే ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన బాధితులు కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చారు. చివరగా.. మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీలు, చైన్ బిజినెస్ వంటి పేర్లతో వచ్చే ఆఫర్లను నమ్మే ముందు పూర్తిగా ఆలోచించాలి. సులభంగా వచ్చే లాభాలు ఎక్కువ సార్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ వైసీపీ ఎమ్మెల్సీ.....

వైసీపీకి రాజీనామా చేసి, జనసేన తీర్ధం...

అసలు బాబుకు లేని...

కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు...

రేవంత్ కొత్త మాస్టర్...

తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా...

మంగళగిరిలో ఐపీఎల్ జాతర.....

గత కొంత కాలంగా క్రీడలకు ప్రోత్సాహం...

ధోని దూరానికి కారణమేమిటి..?

మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు...

బ్రేకింగ్: ఏపీ మద్యం...

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా...

పోల్స్