Friday, September 18, 2026 01:13 AM
Friday, September 18, 2026 01:13 AM

బీఆర్ఎస్‌లో ముసలం.. హరీష్ రావు బీజేపీతో టచ్‌ లో..?

గులాబీ పార్టీలో ముసలం మొదలైందా..? జీవన్ రెడ్డి రాక బీఆర్ఎస్ చీలికకు దారితీస్తోందా..? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి చేరికను హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. కేటీఆర్ ఒత్తిడి మేరకు బలవంతంగా హరీష్ రావును జగిత్యాలకు తీసుకెళ్లారని, కానీ మనస్ఫూర్తిగా ఆయన ఆ చేరికను అంగీకరించడం లేదని తెలిపారు.

Also Read : అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు

ముఖ్యంగా కేసీఆర్ ఫాంహౌస్‌ కు జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు గైర్హాజరు కావడం పార్టీలోని విభేదాలను స్పష్టం చేస్తోందని విమర్శించారు. హరీష్ రావు పార్టీని చీల్చే ప్రయత్నాల్లో ఉన్నారని దయాకర్ అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలతో కలిసి హరీష్ రావు రహస్యంగా ఢిల్లీ వెళ్లారనే వార్తలు వస్తున్నాయని.. పార్టీని వీడటానికే ఆయన ఈ స్కెచ్ వేశారా.? అందుకే జగిత్యాలలో కేసీఆర్ నిర్వహించబోయే సభకు హరీష్ రావు దూరంగా ఉంటున్నారా..? అని దయాకర్ ప్రశ్నించారు.

Also Read : దరిద్రం నుంచి బయటపడ్డ బాలీవుడ్ స్టార్ హీరో..!

ఏడాది తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ బహిరంగ సభకు వెళ్తుంటే, పార్టీ ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్‌లో ముసలం మొదలైందని, ఆయనను పార్టీ కార్యకర్తలే ఐరన్ లెగ్ గా భావిస్తున్నారని అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. గతంలో కవిత కూడా హరీష్ రావును టార్గెట్ చేసి విమర్శలు చేశారని, అందుకే ఆమె పార్టీకి దూరమైందని గుర్తు చేశారు. ఇప్పుడు జీవన్ రెడ్డి చేరిక వల్ల హరీష్ రావు పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి తలెత్తిందని ఆయన విశ్లేషించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్