Saturday, September 26, 2026 02:44 PM
Saturday, September 26, 2026 02:44 PM

దరిద్రం నుంచి బయటపడ్డ బాలీవుడ్ స్టార్ హీరో..!

గత కొన్నాళ్ళుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎట్టకేలకు తన బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ స్టార్ హీరోను.. అతని ఫేవరెట్ డైరెక్టర్ ప్రియదర్శన్ మళ్లీ ఫామ్‌ లోకి తీసుకొచ్చాడు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఫాంటసీ హారర్ కామెడీ భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. శాక్‌నిల్క్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 95.87 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Also Read : ఏపీకి మోదీ సర్కార్ వరాలు..!

ముఖ్యంగా ఆదివారం నాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం 21% ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 11,682 షోల నుండి కేవలం ఒక్కరోజే రూ. 23 కోట్లు కొల్లగొట్టింది. దీంతో.. భారత్ లో మూడు రోజుల్లోనే నెట్ వసూళ్లు రూ. 58 కోట్లకు చేరుకున్నాయి. విదేశాల్లో కూడా ఈ సినిమా హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌ లో ఆదివారం నాడే రూ. 7 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. మొత్తం మీద అక్కడ రూ. 26.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Also Read : తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

ఇండియాలో సాధించిన రూ. 69.37 కోట్ల గ్రాస్ వసూళ్లను కలిపితే, మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 95.87 కోట్లకు చేరాయి. సోమవారం నాటికి ఈ సినిమా సునాయాసంగా రూ. 100 కోట్ల క్లబ్‌ లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ తనదైన మార్కు కామెడీ టైమింగ్‌ తో ప్రేక్షకులను అలరించడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమైంది. వరుస పరాజయాల తర్వాత అక్షయ్ కుమార్ దరిద్రం వదిలిపోయిందని, ప్రియదర్శన్ తన మిత్రుడికి ఒక పర్ఫెక్ట్ కమ్‌ బ్యాక్ ఇచ్చారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

3,677 ఉద్యోగాలు.. మాయమైన...

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న DSC...

పోల్స్