Friday, September 18, 2026 02:05 AM
Friday, September 18, 2026 02:05 AM

విపక్షాలతో మైండ్ గేమ్..? ఎన్నికల కోసమే స్టంట్..?

12 ఏళ్ళ బిజెపి పాలనలో నిన్న పార్లమెంట్ లో జరిగిన పరిణామం మాత్రం ఓ సంచలనమే. గత కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తామని చెబుతూనే, దానిని అత్యంత వివాదాస్పదమైన డీలిమిటేషన్ తో ముడిపెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఇది బీజేపీ వ్యూహాత్మక వైఫల్యమా లేక విపక్షాలను ఇరుకున పెట్టడానికి ఆడిన మైండ్ గేమా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర సర్కార్.. నారీ శక్తి వందన్ అధినియంను తక్షణమే అమలు చేయకుండా, దానిని జనాభా గణన, డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతే అమలు చేస్తామని నిబంధన పెట్టింది.

Also Read : పాపం టీడీపీ సర్పంచ్.. న్యాయం జరుగుతుందా..?

దీని వెనుక అనేక రాజకీయ లెక్కలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుండి 850కి పెంచే భారీ ప్రణాళికను మహిళా బిల్లుతో ముడిపెట్టింది కేంద్రం. ఇది జరిగితే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు భారీగా పెరుగుతాయి. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకే ఈ డీలిమిటేషన్ ప్లాన్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల పేరుతో ఈ కీలక రాజకీయ మార్పును తీసుకురావడమే బీజేపీ అసలు గేమ్ ప్లాన్ అనే మాట బలంగా వినపడుతోంది.

మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే పార్టీగా గుర్తింపు తెచ్చుకుంటూనే, దానికి అడ్డుపడేది ప్రతిపక్షాలే అని ప్రజల్లోకి తీసుకెళ్లడం బీజేపీ వ్యూహం. నిన్న బిల్లు వీగిపోవడంతో ప్రధాని మోడీ, అమిత్ షా వెంటనే విపక్షాలపై విరుచుకుపడ్డారు, మహిళా లోకం వారిని క్షమించదని విమర్శలు కూడా మొదలుపెట్టారు. లోక్సభలో రాజ్యాంగ సవరణకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ అంటే.. 352 ఓట్లు ప్రభుత్వం సాధించలేకపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. ఇది మోడీ ప్రభుత్వానికి గత 12 ఏళ్లలో ఎదురైన మొట్టమొదటి పరాభవంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

Also Read : అయ్యర్ ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి..?: అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

అయితే దీనిపై విపక్షాలు పలు ఆసక్తికర ప్రశ్నలు సందిస్తున్నాయి. మహిళల రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇప్పుడున్న స్థానాల్లోనే ఇవ్వొచ్చు కదా, డీలిమిటేషన్ వరకు ఎందుకు ఆపుతున్నారు..? అన్నది విపక్షాల ప్రధాన ప్రశ్న. మొత్తానికి, మహిళా రిజర్వేషన్ అనే భావోద్వేగ అంశాన్ని అడ్డం పెట్టుకుని దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలన్న బీజేపీ ప్రయత్నం వీగిపోయినా.. దీనిని ఎన్నికల ప్రచారంలో తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ చూస్తుంటే, తాము రాజ్యాంగాన్ని కాపాడామని విపక్షాలు గట్టిగా చెబుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్