Sunday, April 19, 2026 02:20 PM
Sunday, April 19, 2026 02:20 PM

పాపం టీడీపీ సర్పంచ్.. న్యాయం జరుగుతుందా..?

అధికారం అండ ఉంటే, ఎన్నికల్లో ఓడిన వారిని అధికారులే గెలిస్తారు.. గెలిచిన వారిని అధికారులే ఓడిస్తారు. అధికార భయం ఉన్నంత కాలం, అధికారులే ఆ నిర్ణయాలు తీసుకోవటంలో తప్పులేదేమో! కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. అన్న దేవదాసు సినిమా పాట అందరికీ గుర్తే. ఆ పాట అర్ధం, పరమార్ధమే వేరు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక ఘటన ఏమిటంటే.. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిని అధికారుల సహాయంతో ఓడిస్తారు.. ఎన్నికల్లో ఓడిన అభ్యర్దిని అధికారుల తోడ్పాటుతో గెలిపించగలరని సర్పెంచ్ ఎన్నికల్లో రుజువైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు ఎంతగా భయంతో పని చేశారో.. ఎంతగా దిగజారారనేందుకు ఇలాంటి ఘటనలే ఉదాహరణ.

ఇక అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్‌గా విజయం సాధించినా సరే.. అప్పటి అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు.. బెదిరించారు. ఎన్నికల్లో టీడీపీ మద్దతు దారుడు సర్పంచ్‌గా విజయం సాధించినా సరే.. చేసేది ఏమిలేక వైసీపీ మద్దతు దారుడు గెలిచినట్లు అధికారులే ప్రకటించాల్సి వచ్చింది. దీని పై టీడీపీ మద్దతుదారుడు కోర్టుకెళ్లారు. ఓట్లు రీ కౌంటింగ్ చేయాలన్న పిటిషన్‌పై ఐదేళ్ల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ రీ కౌంటింగ్‌లో టీడీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. సర్పంచ్ పదవీ కాలం ముగిసింది కూడా.

Also Read : మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక ప్రకటన..!

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం, గాడిలంక గ్రామ పంచాయతీకి 2021 పిబ్రవరి 21వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు కేవలం 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయినా సరే.. పది ఓట్ల తేడాతో వైసీపీ మద్దతుదారుడే గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. రీ కౌంటింగ్ చేయాలని టీడీపీ మద్దతుదారుడు కోర్టుకెళ్లారు. ఈ పిటిషన్‌పై తీర్పు చెప్పడానికి కోర్టుకు ఐదేళ్లు పట్టింది. రీ కౌంటింగ్‌ నిర్వహించాలని కోర్టు ఇటీవలే తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకు రీ కౌంటింగ్‌లో టీడీపీ మద్దతుదారుడు 14 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు రుజువైంది.

సర్పంచ్ పదవీ కాలం పూర్తి కావటంతో అధికారులు ఇప్పుడేమి చేయలేరు. కానీ అప్పట్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందా..? అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. కూటమి ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. మరోసారి ఇలాంటి అవకతవకలకు పాల్పడకుండా అప్పుడు తప్పులు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కూటమి ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తారా..? ఏదో అయిపోయిందిలే అని వదిలేస్తారా..? అప్పటి అధికారులతో లాలూచీ పడి, వారిని వదిలేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో..! అన్న అనుమానం కలుగుతోంది. అప్పుడు అధికార ప్రభావం.. పని చేస్తే.. ఇప్పుడు డబ్బు ప్రభావం బాగా పని చేస్తుందా.. అనే మాట వినిపిస్తోంది.

Also Read : సింహాద్రి అప్పన్న నిజరూపం.. ముందుగా వారికే..!

పార్టీ పెద్దల అండ లేకపోయినా.. నాటి ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను ఎదిరించి మరీ ఐదేళ్ల పాటు న్యాయ పోరాటం చేసి సక్సెస్ అయిన సర్పంచ్ కానీ సర్పంచ్‌కు ఇప్పటికైనా కూటమి పాలనలో న్యాయం జరుగుతుందా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. గెలిచిన వ్యక్తి ఓడిపోయారని ప్రకటించి.. ఓడిన వ్యక్తికి పట్టం కట్టడమే కాకుండా.. ఐదేళ్ల పాటు జీ హుజూర్ అని భజన చేసిన ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అలా చేయకపోతే.. కూటమి ఎమ్మెల్యే అమ్ముడు పోయారనే విమర్శలు రావటం మాత్రం ఖాయం. మరి సదరు ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టార్గెట్ ధర్మాన, బొత్స.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి....

ఏపీకి మోదీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి...

ఏపీలో స్లీపర్ బస్సుల...

దేశంలో.. దూరప్రాంత ప్రయాణాలకు అత్యంత ఆదరణ...

చిన్నారి పునర్వికకు పునర్జన్మ.....

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక...

మెటాలో 8,000 మంది...

ఏఐ అడుగుపెట్టిన తర్వాత టెక్ రంగంలో...

ఢిల్లీలో రేవంత్ సెన్సేషన్.....

దేశ రాజధాని ఢిల్లీలో డీలిమిటేషన్, మహిళా...

పోల్స్