Friday, September 18, 2026 02:53 AM
Friday, September 18, 2026 02:53 AM

సింహాద్రి అప్పన్న నిజరూపం.. ముందుగా వారికే..!

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్న వారికి జన్మరాహిత్యమే కలుగుతుంది అని సింహాచల క్షేత్ర మహాత్యం తెలియచేస్తోంది. ఏడాది పాటు చందనం పూతతో కనిపించే స్వామి అసలు రూపం చూడాలని లక్షలాది మంది భక్తులు తపించి పోతుంటారు. ఏడాది కాలం పాటు 12 మణుగుల చందనంతో అలంకార భూషితుడైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి.. వైశాఖ శుద్ధ తదియ నాడు ఒక్క రోజు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం అందిస్తాడు. శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి పై ఉన్న సుమారు 500 కిలోల చందనం తొలగింపు అంత సులభంగా జరగదు.ఎంతో ఉత్కృష్టమైన ఈ వైదిక క్రియను నిర్వహించేందుకు ముందస్తు సంస్కార విధులు చాలా ఉంటాయి. వాటిని పూర్తి చేసిన తర్వాతే స్వామిపై ఉన్న చందనాన్ని తొలగించడం జరుగుతుంది.

Also Read : రాజకీయాలకు బొత్స గుడ్ బై..?

చందన తొలగింపు ప్రక్రియను చందనోత్తరణ అంటారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన స్వామి వారి నిజరూప దర్శనం ఏర్పాట్లు చేశారు. వైశాఖ శుద్ధ తదియ వారం రోజుల ముందు నుంచి వైదిక క్రియ మొదలవుతుంది. చైత్ర బహుళ ఏకాదశి నాటి ఉదయం స్వామికి నిత్య ఆరాధనలు ముగిసిన తర్వాత, చందనం అరగతీత కోసం తగిన మేలిమి చందన కలప, సుగంధ ద్రవ్యాలకు షోడశోపచారాలు సమర్పించి, గర్భాలయంలో స్వామి ఎదుట పెట్టి, అనుమతి తీసుకుని ఆలయం చుట్టూ ప్రదర్శన చేసి, బేడా మండపం వద్దకు చేరుకుంటారు. అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం జరిపి చందన కలపకు అరగతీత సానపెట్టెకు హారతి ఇచ్చి.. చందనం తొలి అరగతీతను ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు ఆరంభిస్తారు. తదువరి అధికారులు, ఇతరులు సైతం ఈ క్రియలో పాల్గొంటారు. అనంతరం ఆలయ స్థాన కైంకర్య సిబ్బంది వీటిని వారం రోజుల పాటు, అరగతీత నిర్వహిస్తారు. వారం రోజుల పాటు సుమారు 125 కిలోలు.. 3 మణుగుల చందనాన్ని సేకరించి భండారంలో భద్రపరుస్తారు.

వైశాఖ శుద్ధ విదియ అర్ధరాత్రి.. తెల్ల వారితే తృతీయ, అంటే ఈ నెల 19 రాత్రి గడిచిన తర్వాత తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో స్వామికి సుప్రభాతం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణ, పంచ కలశ ఆవాహనం, ఆరాధనం, నిర్వహిస్తారు. అనంతరం అర్హులైన అర్చక సిబ్బంది ముఖాలకు గంతలు కట్టుకుని వండి బొరిగెలతో స్వామి పై ఉన్న 500 కిలోల చందనాన్ని తొలగించే ప్రక్రియ.. చందనోత్తరణం మొదలు పెడతారు. పూర్తిగా స్వామి పై ఉన్న చందనాన్ని తొలగించిన తదుపరి స్వామికి పంచామృత అభిషేకం, పంచ కలశ అభిషేకం, స్నాపన తిరుమంజనం, విశేష అలంకారం, ఆరాధనం, సేవా కాలం, మంగళ నీరాజనం అనంతరం కేవలంం శీతల పానీయ నివేదనం జరుగుతుంది. ఎటువంటి ఘన పదార్ధం నివేదన ఉండదు. ఈ వైదిక ప్రక్రియ అంతా తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలలోపు జరుగుతుంది.

Also Read : ఎన్టీఆర్ కోసం రిస్క్ చేస్తున్న కన్నడ హీరోయిన్..!

అనంతరం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దేవాలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి వంశీకులకు మాత్రమే తొలి దర్శనం కల్పిస్తారు. తదుపరి ఇతర ప్రముఖులకు, సామాన్య భక్తులకు రాత్రి 8 గంటల వరకు స్వామి నిజరూప దర్శనం కల్పిస్తారు. ఇదే అదే రోజు సాయంత్రం ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం సంప్రదాయ పరులైన వైదిక శ్రీ వైష్ణవ స్వాములు గంగాధర నుంచి మట్టి కలశలతో తీసుకువచ్చిన పవిత్ర గంగాధర జలంతో స్వామికి వెయ్యి కలశలతో అభిషేకం నిర్వహిస్తారు. దీన్నే సహస్ర ఘటాభిషేకం అని పేరు. ఈ వేడుక సమయంలో గర్భాలయంలోకి ఇతరులు ఎవరికీ ప్రవేశం ఉండదు. తదుపరి శీతల పానీయం, పళ్ళు నివేదన అనంతరం రాత్రి తిరిగి తొలి విడత 125 మణుగుల చందనం స్వామికి అలంకరిస్తారు. ఈ అలంకరణలో స్వామి గుమ్మడి పండు ఆకారంలో దర్శనం ఇస్తారు.

తిరిగి వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. దీంతో చందనయాత్ర పరిపూర్ణం అవుతుంది. కొన్ని యుగాల నుంచి వేలాది మందికి నిదర్శనాలు చూపుతున్న స్వామి నేటి తరానికి ప్రత్యక్ష నిదర్శనం చూపుతున్నాడు. స్వామి నిజరూపం గ్రహించే శక్తి మనకి ఉండాలి అంతే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్