యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం డ్రాగన్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత, ఈ ప్రాజెక్ట్ కోసం తన కెరీర్ లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కోసం ఆమె తన దగ్గరకు వస్తున్న ఇతర భాషల క్రేజీ ప్రాజెక్టులను వదులుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : వైసీపీకి నచ్చని ఐఏఎస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!
ప్రశాంత్ నీల్ సినిమాలంటే మేకింగ్ పరంగా భారీ సమయం తీసుకుంటారనే పేరుంది. డ్రాగన్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి భారీ కాల్ షీట్స్ అవసరం కావడంతో, రుక్మిణి వసంత ఇతర సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతోంది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అడ్వాన్స్ లు తీసుకున్నప్పటికీ, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఆమె ఆయా సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవద్దనే నిబంధన కూడా దీనికి ఒక కారణమని టాక్.
Also Read : ఆర్‌సీబీలో పాటిదార్ మ్యాజిక్.. కెప్టెన్ గా రజత్ అదరహో..!
ఒకవైపు యష్ సరసన టాక్సిక్, మరోవైపు ఎన్టీఆర్ సరసన డ్రాగన్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తుండటంతో రుక్మిణి వసంత పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ రెండు చిత్రాలు ఆమె కెరీర్ ను మలుపు తిప్పేవి కావడంతో, ఇతర చిన్న సినిమాల కంటే వీటికే ఆమె ప్రాధాన్యత ఇస్తోంది. షూటింగ్ ఆలస్యమైనా సరే, ఎన్టీఆర్ సినిమాతో వచ్చే పాన్-ఇండియా గుర్తింపు ముందు మిగతా అవకాశాలు చిన్నవే అని ఆమె భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తవ్వగా, త్వరలోనే ఎన్టీఆర్, రుక్మిణి వసంతపై ముఖ్యమైన సీన్లను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.

