Tuesday, August 4, 2026 12:59 AM
Tuesday, August 4, 2026 12:59 AM

లక్నో సూపర్ జెయింట్స్‌కు బ్యాటింగ్ కష్టాలు..!

ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు బౌలర్లు విజయాలు అందిస్తున్నా, బ్యాటింగ్ విభాగం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు నమ్ముకున్న స్టార్ హిట్టర్లు వరుసగా విఫలమవుతుండటం జట్టుకు పెద్ద మైనస్‌ గా మారింది. మిచెల్ మార్ష్, మార్క్రం వంటి దిగ్గజాలు తడబడుతుండగా, వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ ఫామ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత సీజన్లలో 175కు పైగా స్ట్రైక్ రేట్‌ తో బౌలర్లపై విరుచుకుపడే పూరన్, ఈసారి కనీసం 80 స్ట్రైక్ రేట్ కూడా నమోదు చేయలేకపోతున్నాడు.

Also Read : వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. భయపెడుతున్న సెంటిమెంట్..!

ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ ల్లో కలిపి అతను చేసిన పరుగులు కేవలం 42 మాత్రమే. తాజాగా ఆర్‌సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ 7 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగుకే క్లీన్ బౌల్డ్ అవ్వడం గమనార్హం. పూరన్ ఆటతీరుపై అటు విశ్లేషకులు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. హిట్టర్‌ గా పేరున్న పూరన్ ఇలా టెస్ట్ మ్యాచ్ తరహాలో ఆడటం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోందని అభిప్రాయపడుతున్నారు. లక్నో తన తదుపరి మ్యాచ్‌ల్లో పుంజుకోవాలంటే ఈ స్టార్ బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం అత్యవసరం అంటున్నారు.

Also Read : మరోసారి వివాదంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి..!

జట్టును ముందుండి నడిపించాల్సిన పంత్, మొదటి 13 మ్యాచ్‌ల్లో కేవలం 151 పరుగులు మాత్రమే చేసి తడబడ్డాడు. ఆర్సీబీతో జరిగిన తాజా మ్యాచ్‌లోనూ కేవలం 1 పరుగుకే పరిమితమయ్యాడు. లక్నో బ్యాటర్లు టీ20 శైలికి భిన్నంగా వన్డే తరహాలో ఆడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌ లో టోర్నీలోనే అత్యల్పంగా 129.66 స్ట్రైక్ రేట్‌ తో లక్నో బ్యాటింగ్ చేస్తోంది. అబ్దుల్ సమద్ వంటి ఆటగాళ్ళు కూడా ఫెయిల్ కావడం గమనార్హం. కేవలం ఆయుష్ బదోని, కొత్త ఆటగాడు ముకుల్ చౌదరి మాత్రమే కొన్ని మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శనతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

పోల్స్