Sunday, September 20, 2026 01:11 AM
Sunday, September 20, 2026 01:11 AM

రాజకీయాలకు బొత్స గుడ్ బై..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇటీవల పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన ఆయన భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న ఘటన తెలిసిందే. గతంలో వైయస్ కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనపై విమర్శలు చేసిన విషయాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తావించింది. దీనికి ప్రతిస్పందనగా విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన బొత్స, పాత సంఘటనలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయన ప్రజల ముందు కనిపించడం తగ్గింది.

Also Read : ఇలా చేస్తే ఆ ప్రాంతం ముందుకు వెళ్తుందా..?

ఈ పరిణామం నేపథ్యంలో బొత్స సైలెన్స్‌కు గల కారణాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ మరియు ఆయన కుటుంబంపై చేసిన విమర్శలను టిడిపి మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పటి వీడియోలు, క్లిప్పింగ్స్‌ను ప్రదర్శిస్తూ బొత్స చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ఈ క్రమంలో టిడిపి నేత కింజరాపు అచ్చెనాయుడు స్పందించినప్పటికీ, ఆపై బొత్సపై విమర్శలు మరింత పెరిగాయి.

ఇక బొత్స భావోద్వేగానికి లోనవ్వడం వెనుక మరిన్ని కారణాలున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలను జగన్ ఎలా స్వీకరిస్తారో అన్న ఆందోళనతోనే బొత్స స్పందించారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బొత్స వ్యాఖ్యలపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో విపరీత ప్రచారం సాగుతోంది.

Also Read : మరోసారి వివాదంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి..!

ఇక బొత్సను రాజకీయ అవసరాల దృష్ట్యా మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని, ఆయన చేరికపై పార్టీలోనే కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని కూడా వినిపిస్తోంది. ఈ పరిణామాల అనంతరం బొత్స ప్రజా కార్యకలాపాలకు దూరంగా ఉండడం గమనార్హం. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఈ వివాదాల ఒత్తిడిని తట్టుకోలేకపోయారని భావిస్తున్నారు. ఇకపై ఆయన క్రియాశీలక రాజకీయాలకు వీడ్కోలు పలుకుతారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్