Friday, April 17, 2026 01:16 AM
Friday, April 17, 2026 01:16 AM

ఇలా చేస్తే ఆ ప్రాంతం ముందుకు వెళ్తుందా..?

వైసీపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తానా అంటే తందానా అంటున్నారు ఆ పార్టీ నేతలు. జగన్ ఏం చెబితే అదే వేదం అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అసలు అధినేత ఏం చెప్పారు.. మనం గతంలో ప్రజలకు ఏం చెప్పామనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అన్న చెప్పాడు.. మేము పాటిస్తున్నాం.. అంతే.. ఇక్కడ మరో మాట లేదు.. ఇంకా చెప్పాలంటే.. మాకు మరో ఛాయిస్ లేదు అన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వాళ్ల క్రెడిబిలిటీ పైనే ప్రభావం చూపిస్తోంది.

Also Read : వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. భయపెడుతున్న సెంటిమెంట్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే తమ ప్రాంతం వెనుకబాటుకు గురైందనేది తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నేతల మాట. ఇదే ప్రధాన సాకుగా చూపిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో కేసీఆర్ ఉద్యమం ప్రారంభించారు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరుగుతోంది అంటూ.. ఆ ప్రాంతాలకు చెందిన కొంతమంది నేతలు మేథావుల ముసుగులో 2014-19 మధ్య కాలంలో నాటి చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఇక కొంతమంది సో కాల్డ్ పెద్దలు అయితే.. గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలంటూ వింత ప్రతిపాదన కూడా చేశారు.

2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఇదే మాటను బాగా ప్రచారం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని.. దీని వల్ల అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆరోపింంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మాట మార్చారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు ఏర్పాటు వల్లే సాధ్యమన్నారు. పరిపాలన, శాసన, న్యాయ రాజధానులు అంటూ వింత ప్రతిపాదన చేశారు. పరిపాలనను విశాఖ నుంచి చేయటం వల్ల ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా ముందుకు దూసుకెళ్తుందని.. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ గ్రోత్ రేట్ పెరుగుతుందని మాయ మాటలు చెప్పారు.

ఎన్నికల ముందు అమరావతిలోనే తన ఇల్లు అనగానే.. సూపర్ అన్న వైసీపీ నేతలు.. తర్వాత 3 రాజధానులు అనగానే.. ఇది అద్భుతమంటూ డప్పు కొట్టారు. అదే సమయంలో ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పిన వారిపై ఉత్తరాంధ్ర ద్రోహులు అంటూ ముద్ర వేశారు. జగన్ ప్రకటనతో ఉత్తరాంధ్ర రాష్ట్రానికే కాదు.. దేశానికే కాదు.. ప్రపంచానికే ఆదర్శంగా మారుతుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, సీదిరి అప్పల్రాజు, గుడివాడ అమర్నాథ్ సహా ఆ పార్టీ నేతలంతా తెగ ఊదరగొట్టారు. అదే నేతలు అమరావతిపై చేసిన ఆరోపణల వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి కూడా.

Also Read : బుల్లెట్ దింపుతా అన్నారు.. ఎక్కడున్నారు..?

అయితే తాజాగా జగన్ మావిగన్ అనే వింతైన, విచిత్రమైన ప్రతిపాదన చేయగానే.. మళ్లీ ఇదే నేతలు తాము గతంలో చేసిన అన్ని ప్రకటనలను మర్చిపోయారేమో తెలియదు కానీ.. మావిగన్ అనేది అద్భుతమైన ప్రతిపాదన అని.. అసలు ఇలాంటి ప్రతిపాదన ఎవరూ చేయలేరన్నారు. నిజానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపితే మావిగన్ ఏర్పాటు అవుతుంది. మరి విజయవాడ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ సహా ఉత్తరాంధ్ర మావిగన్ వల్ల అన్యాయం జరగదా అనే ప్రశ్నకు వైసీపీ నేతలు నీళ్లు నములుతున్నారు. మావిగన్ వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ముందుకు వెళ్తాయా అనే ప్రశ్నలకు దిక్కులు చూస్తున్నారు. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై ఇప్పటికే ఏపీ సహా దేశవ్యాప్తంగా నవ్వుకుంటుంటే.. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నా సరే.. వైసీపీ నేతలు మాత్రం.. తమ అధినేత ప్రతిపాదన సూపర్ అంటూ భజన చేస్తూనే ఉన్నారు. మరి మావిగన్ వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎలా ముందుకు వెళ్తాయో వైసీపీ నేతలే జవాబు చెబితే బాగుంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాలకు బొత్స గుడ్...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు...

వైసీపీకి నచ్చని ఐఏఎస్.....

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

మరోసారి వివాదంలో శ్రీశైలం...

గత కొన్నాళ్ళుగా వివాదాస్పదంగా మారిన.. శ్రీశైలం...

సార్.. నా పేరు...

తాము చేస్తే సంసారం.. ఎదుటి వాళ్లు...

అది నీలి ప్రచారం.....

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం...

డీలిమిటేషన్‌ అంటే ఏమిటి?

జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ,...

పోల్స్