Sunday, September 20, 2026 02:00 AM
Sunday, September 20, 2026 02:00 AM

వైసీపీకి నచ్చని ఐఏఎస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, త్వరలోనే గవర్నర్ ద్వారా అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Also Read : అమాంతం పెరిగిన రేవంత్ పరపతి..!

అనిల్ చంద్ర పునేఠా నియామకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి బలమైన కారణం ఉంది. 2019 పునేఠా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో.. అప్పటి ప్రతిపక్షం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను ఆ పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు అదే అధికారిని చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా ఎంపిక చేయడం ద్వారా, ఆయనకున్న అనుభవాన్ని ఎన్నికల నిర్వహణలో వాడుకోవాలని భావిస్తోంది.

Also Read : చింతమనేనిపై వైసీపీ ఎమ్మెల్సీ ప్రశంసల జల్లు..!

ఇదే క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పునేఠా బాధ్యత వహిస్తున్న విజిలెన్స్ కమిషనర్ పదవిలో మరో రిటైర్డ్ ఐఏఎస్, మాజీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌ ను నియమించనున్నారు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న నీరభ్ కుమార్ నియామకం ద్వారా విజిలెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్‌ఈసీ నియామకం చుట్టూ పెద్ద ఎత్తున వివాదాలు నడిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన నేపధ్యంలో.. ఈ నిర్ణయం కీలకంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్