ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రజాప్రతినిధిపై కస్టోడియల్ టార్చర్ వంటి అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్ రక్షణ కాకూడదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉండి, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
Also Read : బ్రేకింగ్: లోకేష్ సంచలన నిర్ణయాలు..!
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఒక సంచలన పోలికను తెరపైకి తెచ్చింది. దేశ అత్యున్నత సభ అయిన పార్లమెంట్ పై దాడికి తెగబడిన ఉగ్రవాదులకు, ఒక పార్లమెంట్ సభ్యుడిని కస్టడీలో పెట్టి తీవ్రంగా హింసించిన వారికి మధ్య ఎలాంటి తేడా లేదని న్యాయస్థానం తీవ్రంగా వ్యాఖ్యానించింది. చట్టసభలను, ప్రజాప్రతినిధులను గౌరవించని ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అని కోర్టు అభిప్రాయపడింది.
Also Read : డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం..!
తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పిన ఏపీ హైకోర్టు, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తరఫు న్యాయవాదిని నేరుగా ప్రశ్నించింది. అసలు నిందితుడైన సదరు అధికారి చట్టం ముందు ఎప్పటిలోగా సరెండర్ అవుతారో స్పష్టంగా చెప్పాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు మరియు ఆదేశాలు ప్రస్తుతం ఏపీ పోలీసు వర్గాలతో పాటుగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

