మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యా వ్యవస్థలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్న మంత్రి నారా లోకేష్.. తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎంశ్రీ నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెం.1 స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
Also Read : ఆర్టీసీ ప్రైవేటీకరణ.. సర్కార్ క్లారిటీ..!
ఈ సమీక్షలో భాగంగా కస్తూరిబా హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినుల వసతులపై మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. హాస్టళ్లలో చదువుకునే బాలికలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో బెడ్స్ (మంచాలు, పరుపులు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు, జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు అవసరమైన స్టడీ కిట్స్ ను త్వరితగతిన పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తల్లికి వందనం పథకాన్ని అనాథ పిల్లలకు కూడా వర్తింపజేయాలని లోకేష్ నిర్ణయించారు.దేవరకొండ అరుదైన గ్లోబల్ రికార్డ్..!
Also Read :
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు వారి హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను కోరారు. అలాగే, మాతృభాష ప్రాధాన్యతను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు తెలుగు భాషా పుస్తకాలను మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా.. తెలుగు అకాడమీ పుస్తకాలను ఇకపై ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు.

