Thursday, June 18, 2026 11:33 PM
Thursday, June 18, 2026 11:33 PM

నల్లపరెడ్డికి చుక్కలు చూపించిన ఆడపులి..!

అపార రాజకీయ అనుభవంతో పాటు ఆరు ధపాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన, వైసీపీ మాజీ మంత్రికి, ఒక టీడీపీ మహిళా ఎమ్మెల్యే తన వాగ్దాటితో.. చెప్పిన మాట చెప్పకుండా, ఆయన చేసిన విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పిన తీరు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు రాజకీయాలు తొలి నుంచి ఏపీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మరీ ముఖ్యంగా నెల్లూరు పెద్ద రెడ్ల రాజకీయం. ఇప్పుడు అదే నెల్లూరు రెడ్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా మహిళా నేతపై నోటికొచ్చినట్లు మాట్లాడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. మళ్లీ జీవితంలో తలెత్తుకో లేకుండా ధీటైనా సమాధానం చెప్పి నోరు మూయించారు టీడీపీ మహిళా ఎమ్మెల్యే.

Also Read : బ్రేకింగ్: లోకేష్ సంచలన నిర్ణయాలు..!

ఆడ పులిలా గాండ్రించిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు. రెండు, మూడు రోజులుగా అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియా ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నల్లపరెడ్డి చేసిన విమర్శలకు ప్రశాంతి రెడ్డి ధీటుగానే స్పందించారు. నిజానికి నల్లపరెడ్డికి ప్రశాంతి రెడ్డి దగ్గరి బంధువు కూడా. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంత మేనమామ. చంద్రమోహన్ తమ్ముడి భార్య ప్రశాంతి రెడ్డి. ఇలా చూసుకుంటే.. ప్రసన్నకుమార్ రెడ్డికి ప్రశాంతి రెడ్డి సోదరి అవుతారు.

భర్త మరణించడంతో.. కుటుంబ సభ్యుల అనుమతితోనే ప్రస్తుత నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ప్రశాంతి రెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో బాహాటంగానే ధైర్యంగా చెప్పారు. ప్రశాంతి టీడీపీ తరఫున, ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ తరఫున కోవూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. అయితే వరసకు సోదరి చేతిలోనే ఏకంగా 50 వేల ఓట్ల తేడాతో ఓడటంతో.. తట్టుకోలేకపోతున్న ప్రసన్నకుమార్ రెడ్డి.. ఆ కక్షతో అసభ్యపదజాలంతో నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన ఇంటిపై వేమిరెడ్డి అభిమానులు దాడి కూడా చేశారు.

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదు కావడంతో.. కొన్ని రోజులు నోటికి తాళం వేసిన నల్లపరెడ్డి.. మళ్లీ టార్గెట్ ప్రశాంతి రెడ్డి అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. దీంతో తాను కూడా ఇక వెనకడుగు వేసేది లేదన్నట్లుగా ధీటుగానే జవాబిచ్చారు ప్రశాంతి రెడ్డి. తనను సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ప్రసన్నకుమార్‌కు అవును.. నిజమే.. ఒకప్పుడు సోమిరెడ్డి గారి కుటుంబ కోడలినే.. ఇప్పుడు కుటుంబ సభ్యుల అనుమతితోనే వేమిరెడ్డి వారిని వివాహం చేసుకున్నా.. వాళ్లకు లేని ఇబ్బంది నీకు ఎందుకు వచ్చిందంట.. అని గట్టిగానే జవాబు చెప్పారు. ముందు నువ్వు చేసిన అక్రమాలకు జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండూ.. అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరున్నారు..?

సమీప బంధువు, మహిళ అని కూడా చూడకుండా.. ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పదే పదే ఇలా ఇంటి పేరు మార్చి పిలవడం ఎంత వరకు సబబనే మాట నెల్లూరులో జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు చేయాలి తప్ప.. ఇలా వ్యక్తిగత జీవితంపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం తప్పంటున్నారు. నిజానికి గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. అప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించని నల్లపరెడ్డి.. పార్టీ మారిన వెంటనే.. ఆమె ఇంటి పేరు మార్చి మరీ విమర్శలు చేయడం సబబు కాదంటున్నారు. సోదరి వరసయ్యే మహిళను గౌరవించాలని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్