Friday, September 18, 2026 06:29 AM
Friday, September 18, 2026 06:29 AM

తెలంగాణాలో జనసేన తొలి అడుగు..!

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్న.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు దూకుడు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్.. జనసేనాని.. హైదరాబాద్‌ లోని మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ నూతన కార్యాలయాన్ని వైభవంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో జనసైనికులు, అభిమానులు హాజరు కానున్నారు.

Also Read : భారత్ – బ్రిటన్ క్రేజీ డీల్.. చౌకగా లభించే వస్తువులు ఇవే..!

పవన్ కల్యాణ్ రాకతో మణికొండ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణకు ఈ నూతన కార్యాలయం ఒక కీలక వేదికగా మారనుంది. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త ఆఫీస్‌ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇకపై తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాలన్నీ ఈ కేంద్రం నుంచే సాగనున్నాయి. కేడర్‌ కు దిశానిర్దేశం చేయడానికి, ప్రజల సమస్యలపై పోరాడటానికి ఈ కార్యాలయం ముఖ్య భూమిక పోషిస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Also Read : ‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.. కొత్త సీన్స్ ఎంట్రీ..!

ఈ సందర్భంగా తెలంగాణలో జనసేన సంస్థాగత నిర్మాణంపై అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. త్వరలోనే అన్ని జిల్లా కమిటీలను నియమించి, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా విజయవంతమైన జనసేన, ఇప్పుడు తెలంగాణలోనూ తన ఉనికిని చాటుకోవడానికి, బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఈ నూతన కార్యాలయం ద్వారా సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్