Friday, September 18, 2026 09:14 AM
Friday, September 18, 2026 09:14 AM

‘మెగా 158’.. క్రేజీ అప్‌డేట్..!

మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’ సరికొత్త షెడ్యూల్‌ను జరుపుకోవడానికి సిద్ధమైంది. సినిమా మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత, చిత్రబృందం ఇప్పుడు రెండో షెడ్యూల్‌ను ప్రారంభించబోతోంది. ఎంతో కీలకమైన ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ నిర్మించారు. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగినట్లుగా ఉండే ఈ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సెట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొల్లాచిలో ఫస్ట్ షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్న మెగా-158 టీమ్.. ఇప్పుడు రెండో షెడ్యూల్‌లో కొన్ని మైండ్ బ్లోయింగ్ హై – వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేశారు.

వీటితో పాటు కథను మలుపు తిప్పే కీలకమైన టాకీ భాగాలను కూడా ఇదే సెట్‌లో చిత్రీకరించనున్నారు. మెగాస్టార్ తన వింటేజ్ మాస్ లుక్‌లో గ్రేస్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో మెప్పించేలా దర్శకుడు బాబీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ గురించి మేకర్స్ చాలా స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రాబోయే సంక్రాంతి కానుకగా ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండుగ సీజన్ బాక్సాఫీస్ అడ్వాంటేజ్‌ను పూర్తిగా వాడుకునేలా షూటింగ్ షెడ్యూల్స్ అన్నింటినీ పక్కా టైమ్ లైన్‌తో రన్ చేస్తున్నారు.

Also Read : ఇంటర్వ్యూల దెబ్బకు స్టార్ హీరో హడల్..!

ఈ సంక్రాంతి రేసు ప్రకటనతోనే ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడే వసూళ్ల లెక్కలు మొదలైపోయాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నటించబోయే అగ్ర కథానాయిక ఎవరనే విషయంపై చిత్ర యూనిట్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి ఆ వివరాలను చాలా రహస్యంగా ఉంచారు. హైదరాబాద్ షెడ్యూల్ ముగిసేలోపే అధికారికంగా హీరోయిన్ పేరు అనౌన్స్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేస్తోంది. దీనితో ఈ క్రేజీ సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుంది. సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చిరంజీవి కూతురి పాత్ర చుట్టూ తిరిగే ఎమోషనల్ బాండింగ్. మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఈ చిత్రంలో మెగాస్టార్ కుమార్తెగా నటిస్తోంది. కథలో అనస్వర రాజన్ క్యారెక్టర్ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని, తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తాయని టాక్.

Also Read : బ్రేకింగ్: అల్లు అర్జున్‌ కు నాంపల్లి కోర్టు షాక్..!

ఈ క్రేజీ కాంబినేషన్ స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌గా ఉండబోతోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. బాబీ, చిరంజీవి గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ తరహాలోనే ఊపు తెచ్చే మాస్ బీట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. దర్శకుడు బాబీకి చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మాస్ పల్స్‌పై ఉన్న పట్టు ఈ ప్రాజెక్ట్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఊహించని ట్విస్టులు, అదిరిపోయే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి మేకర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్