Tuesday, August 4, 2026 04:24 AM
Tuesday, August 4, 2026 04:24 AM

సూర్యవంశి కోసమే ఎందుకీ నిర్ణయం..?

భారత క్రికెట్ లో సంచలనంగా మారిన.. 15 ఏళ్ల యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో ఒక అపూర్వమైన నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. త్వరలోనే భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేయబోతున్న వైభవ్‌ తో పాటు, అతని విదేశీ పర్యటనలకు తల్లిదండ్రులు కూడా వెళ్లేందుకు బీసీసీఐ అధికారికంగా అనుమతి ఇచ్చింది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ లలో వైభవ్ ఆడనుండగా.. అతని తల్లిదండ్రుల ప్రయాణ, వసతి ఖర్చులన్నింటినీ బోర్డే భరించనుందని బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

Also Read : ఇంటర్వ్యూల దెబ్బకు స్టార్ హీరో హడల్..!

ఒక సీనియర్ జాతీయ జట్టులో 15 ఏళ్ల మైనర్ బాలుడు ఎంపిక కావడం అనేది దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి అని దేవజిత్ సైకియా తెలిపారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే ఇంత చిన్న వయసులో భారత్‌ కు ప్రాతినిధ్యం వహించాడని ఆయన గుర్తుచేశారు. జట్టులోని మిగతా ఆటగాళ్లు, మేనేజ్మెంట్ అంతా 18 ఏళ్లు పైబడిన వయోజనులు కావడంతో, వైభవ్ ఒంటరిగా ఇబ్బంది పడకుండా, ఆ పెద్దల వాతావరణానికి సులువుగా అలవాటు పడేందుకే ఈ మానవతా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Also Read : తెలంగాణాలో జనసేన తొలి అడుగు..!

స్కూల్ పిల్లలు విహారయాత్రకు వెళ్లినప్పుడు పెద్దలు తోడు ఉన్నట్లే, వైభవ్‌ కు వాళ్ల పేరెంట్స్ అండగా ఉంటారని బీసీసీఐ పేర్కొంది. ఐపిఎల్ లో వరుసగా రెండు సీజన్ల పాటు అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే ట్రై సిరీస్‌ లో ఇండియా-ఏ జట్టు తరఫున దుమ్మురేపాడు. ఈ అసాధారణ ప్రతిభతోనే అతను సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. జూన్ 26వ తేదీన బెల్ఫాస్ట్‌ లో ఐర్లాండ్‌ తో జరగబోయే మ్యాచ్‌ తో వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ ను ప్రారంభించబోతున్నాడు. రాబోయే రెండు మూడు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌ కు ఇతను ఒక అద్భుతమైన ఆస్తిగా మారుతాడని బీసీసీఐ కొనియాడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

పోల్స్