Friday, September 18, 2026 11:59 AM
Friday, September 18, 2026 11:59 AM

కొత్త ఫీచర్స్ తో బజాజ్ పల్సర్ 220F..!

బజాజ్ ఆటో తన మోస్ట్ పాపులర్ బైక్ పల్సర్ 220ఎఫ్ కు కస్టమర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక కీలకమైన అప్డేట్‌ ను అందించింది. ఈ బైక్‌ కు సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ లైట్‌ తో పాటు ఎల్‌ఈడీ డిఆర్ఎల్స్ ను అమర్చింది. గత డిసెంబర్ 2025 లో సరికొత్త గ్రాఫిక్స్, ఎల్‌ఈడీ ఇండికేటర్లు, కొత్త కలర్ ఆప్షన్లతో వచ్చిన ఈ బైక్‌ కు.. ఇది రెండో ముఖ్యమైన అప్డేట్ కావడం విశేషం. పాత హాలోజన్ లైటింగ్ స్థానంలో వచ్చిన ఈ కొత్త ఎల్‌ఈడీ సెటప్.. బైక్ పాత సెమీ ఫెయిర్డ్ ఫ్రంట్ లుక్‌ లోనే చక్కగా ఇమిడిపోయింది.

Also Read : ఇంటర్వ్యూల దెబ్బకు స్టార్ హీరో హడల్..!

బైక్ బాడీవర్క్ లేదా డిజైన్ సిల్హౌట్‌ లో ఎలాంటి మార్పులు చేయలేదు, దీనివల్ల పల్సర్ 220F కు ఉన్న ఐకానిక్ లుక్ అలాగే కొనసాగుతోంది. ఇక మెకానికల్ పరంగా చూస్తే బైక్‌ లో ఎలాంటి మార్పులు లేవు. ఇది మునుపటి లాగే 20.9 హెచ్‌ పి పవర్, 18.6 ఎన్ఎమ్ టార్క్‌ ను ప్రొడ్యూస్ చేసే 220cc సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ తో పాటు 5-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంది. ఈ కొత్త ఎల్‌ఈడీ ఫీచర్ అప్డేట్ కారణంగా ఈ బైక్ ధర రూ. 8,000 వరకు పెరిగింది.

Also Read : బ్రేకింగ్: అల్లు అర్జున్‌ కు నాంపల్లి కోర్టు షాక్..!

ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం పల్సర్ 220F సరికొత్త ధర ఇప్పుడు రూ. 1.36 లక్షలుగా ఉంది. బజాజ్ పోర్ట్‌ఫోలియోలో ఇది అత్యంత పాత మోడల్ అయినప్పటికీ, మార్కెట్లోకి ఎన్ని సరికొత్త మోడళ్లు వచ్చినా దీనికున్న క్రేజ్ మరియు నమ్మకమైన కస్టమర్ బేస్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఎల్‌ఈడీ అప్డేట్ బడ్జెట్ ధరలో మంచి బైక్ కోరుకునే వారికి మరింత బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

దేశంలోనే నెంబర్ వన్.....

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ జాతీయ...

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

పోల్స్