Sunday, April 19, 2026 02:32 PM
Sunday, April 19, 2026 02:32 PM

ఈరోజు రాశి ఫలితాలు (17-04-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం.. 17-04-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.

—————————————

వృషభం

ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి.

—————————————

మిధునం

ఆలయ సందర్శన చేసుకొంటారు. సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

—————————————

కర్కాటకం

కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

సింహం

ఆర్ధికపరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు.

—————————————

కన్య

సమయానికి తగిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు.

—————————————

తుల

గృహమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పైవారి నుండి మాట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు.

—————————————

వృశ్చికం

నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బందిపడతారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

—————————————

ధనస్సు

అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు.

—————————————

మకరం

అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి.

—————————————

కుంభం

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి.

—————————————

మీనం

ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టార్గెట్ ధర్మాన, బొత్స.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి....

ఏపీకి మోదీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి...

ఏపీలో స్లీపర్ బస్సుల...

దేశంలో.. దూరప్రాంత ప్రయాణాలకు అత్యంత ఆదరణ...

చిన్నారి పునర్వికకు పునర్జన్మ.....

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక...

మెటాలో 8,000 మంది...

ఏఐ అడుగుపెట్టిన తర్వాత టెక్ రంగంలో...

ఢిల్లీలో రేవంత్ సెన్సేషన్.....

దేశ రాజధాని ఢిల్లీలో డీలిమిటేషన్, మహిళా...

పోల్స్