Friday, September 18, 2026 02:55 AM
Friday, September 18, 2026 02:55 AM

నెల రోజుల్లో బాక్సాఫీస్ వద్ద దురంధర్ 2 రచ్చ రచ్చ..!

భారత సినీ చరిత్రలో దురంధర్ 2 సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గతంలో ఏ ఇండియన్ సినిమా కూడా ఒకే నెలలో ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. కేవలం పది రోజుల్లోనే రూ. 1000 కోట్ల మార్కును దాటి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్‌ లో ఈ సినిమా ప్రభంజనం ఓ రేంజ్ లో ఉంది.

Also Read : గెలుపు కోసం రంగంలోకి వైసీపీ కొత్త నేత..!

కేవలం ఆరు రోజుల్లోనే రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధించి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల రికార్డులను తిరగరాసింది. నెల రోజులు ముగిసే సమయానికి ఒక్క భారత్ లోనే.. రూ. 1,150 కోట్ల నెట్ వసూళ్ళు సాధించింది. ముఖ్యంగా హిందీ, తెలుగు రాష్ట్రాల్లో 30వ రోజున కూడా 70 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా దురంధర్ 2 తన సత్తా చాటింది. ఓవర్సీస్ మార్కెట్‌ లో ఈ చిత్రం 100 మిలియన్ డాలర్లు అంటే.. రూ. 830 కోట్లు మైలురాయిని అధిగమించింది.

Also Read : పాక్ పర్యటనకు ట్రంప్.. అది జరిగితేనే వస్తా..!

ఉత్తర అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో నాన్ ఇంగ్లీష్ చిత్రాల కేటగిరీలో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి మూడు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఐమాక్స్ స్క్రీన్ల ద్వారానే దాదాపు రూ. 125 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. ఈ సినిమా సాధించిన మరో అరుదైన రికార్డు ఏమిటంటే, నెల రోజులు గడిచినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1,500కి పైగా స్క్రీన్లలో విజయవంతంగా రన్ కావడం. సాధారణంగా పెద్ద సినిమాలు రెండో వారం తర్వాత థియేటర్ల సంఖ్య తగ్గుతాయి, కానీ దీనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎగ్జిబిటర్లు షోల సంఖ్యను పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ రూ. 2,500 కోట్ల మార్కును చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్