Friday, September 18, 2026 02:05 AM
Friday, September 18, 2026 02:05 AM

చిన్నారి పునర్వికకు పునర్జన్మ.. అన్నగా మాట నిలబెట్టుకున్న లోకేష్

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక కోసం దాతలు, ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన అలుపెరగని కృషి ఫలించింది. సుమారు రూ.16 కోట్ల ఖరీదైన ‘జోల్ జెన్ స్మా’ ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి సకాలంలో తెప్పించడంలో దాతల సహకారం, ఆయన చూపిన చొరవతో ఆ చిన్నారికి పునర్జన్మ లభించింది. స్మైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్వికను కాపాడటానికి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ అవసరమైంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, దాతలు భారీగా స్పందించారు.

Also Read : నెల రోజుల్లో బాక్సాఫీస్ వద్ద దురంధర్ 2 రచ్చ రచ్చ..!

అయితే, విదేశాల నుండి ఈ ఇంజెక్షన్ రప్పించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. తన వంతుగా భారీ ఆర్ధిక సహాయం కూడా అందించారు లోకేష్. అదే విధంగా అధికారులతో సమన్వయం చేస్తూ, అత్యంత వేగంగా ఇంజెక్షన్ భారత్‌ కు చేరేలా పర్యవేక్షించారు. శనివారం హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆసుపత్రిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో వైద్యులు చిన్నారి పునర్వికకు ఈ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పాప ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

Also Read : విపక్షాలతో మైండ్ గేమ్..? ఎన్నికల కోసమే స్టంట్..?

ప్రజల ప్రార్థనలు, దాతల సాయం వృధా కాకుండా చిన్నారి ప్రాణాలు నిలబడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఒక అన్నగా అండగా నిలిచిన మంత్రి లోకేష్‌తో పాటు, ఆర్థికంగా సహాయం చేసిన దాతలకు, శ్రమించిన వైద్యులకు పునర్విక కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చూపిన ఈ మానవత్వంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇది పున‌ర్జ‌న్మే..

తాము పున‌ర్విక‌కు జ‌న్మ‌నిస్తే.. మంత్రి నారా లోకేష్‌, మాన‌వ‌తాహృద‌యాల స్పంద‌న‌తో పున‌ర్జ‌న్మ ల‌భించింద‌ని త‌ల్లిదండ్రులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చేసిన సాయాన్ని జీవింతాంతం గుర్తుపెట్టుకుంటామని భావోద్వేగంతో చెప్పారు. తమ చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు స‌హాయం అందించ‌డ‌మే కాకుండా, భ‌విష్య‌త్తులోనూ అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని లోకేష్ భ‌రోసా ఇచ్చార‌ని తెలిపారు. వైద్యం అందించిన డాక్ట‌ర్లు, స్పందించిన ప్ర‌తి హృద‌యానికి, ప్రార్థించిన ప్ర‌తీ ఒక్క‌రికీ, సాయం అందించిన ప్ర‌తీ ఒక్క‌రికీ న‌మ‌స్కారాలు తెలియ‌జేశారు పున‌ర్విక త‌ల్లిదండ్రులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్