Wednesday, July 22, 2026 04:23 AM
Wednesday, July 22, 2026 04:23 AM

ముంబైలో ఇల్లు ఇంత ఖరీదా..? అయినా దొరకడం కష్టమే..!

అంతర్జాతీయంగా లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో భారత నగరాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ తాజాగా విడుదల చేసిన ‘ది వెల్త్ రిపోర్ట్ 2026’ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న లగ్జరీ హౌసింగ్ మార్కెట్ల జాబితాలో మన దేశానికి చెందిన ముంబై, బెంగళూరు నగరాలు టాప్-10 లో నిలిచాయి నైట్ ఫ్రాంక్ రూపొందించిన ‘ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్’ ప్రకారం.. లగ్జరీ ఇళ్ల ధరల పెరుగుదల మరియు డిమాండ్ విభాగంలో ఐటీ హబ్ బెంగళూరు ప్రపంచంలోనే 8వ స్థానంలో నిలిచింది.

Also Read : ఏపీ మైనింగ్ కుంభకోణంపై ఈడీ గురి..? అరెస్ట్ లు ఖాయమా..?

ఇక్కడ ఏడాది కాలంలోనే విలాసవంతమైన ఇళ్ల ధరలు 9.4 శాతం పెరిగాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచ వ్యాప్తంగా 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబైలో లగ్జరీ ఇళ్ల రేట్లు 8.7 శాతం మేర వృద్ధి చెందాయి. అంతర్జాతీయ మార్కెట్లో టోక్యో (58.5%), దుబాయ్ (25.1%) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ ఈ నివేదికలో ముంబై నగరాన్ని అమెరికాలోని అత్యంత ఖరీదైన న్యూయార్క్ సిటీతో పోల్చడం విశేషం. ముంబైకి ఉన్న పరిమిత తీరప్రాంత భౌగోళిక పరిస్థితులు, తీవ్రమైన స్థల కొరత కారణంగా అక్కడ లగ్జరీ ఇళ్లకు విపరీతమైన ప్రీమియం ధరలు పలుకుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

Also Read : భారత్‌ లోకి కియా క్రేజీ కారు..? అనంతపురంలో తయారి స్టార్ట్..?

కేవలం ఒక్క ఏడాదిలోనే ముంబై నగరంలో 5 మిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో దాదాపు రూ. 40 కోట్లకు పైబడిన ధర ఉన్న సరికొత్త లగ్జరీ ఇళ్లు ఏకంగా 56 అమ్ముడవడం ఇక్కడి మార్కెట్ క్రేజ్‌కు నిదర్శనం. రియల్ ఎస్టేట్ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. దేశంలో కనిపిస్తున్న ఈ లగ్జరీ హౌసింగ్ గ్రోత్ కేవలం కృత్రిమమైనది లేదా ఊహాజనితమైనది కాదు. దేశీయంగా ఉన్న బలమైన డిమాండ్ ఆధారంగానే ఈ స్థిరమైన వృద్ధి సాగుతోంది. దేశంలో జీడీపీ వృద్ధి రేటు పెరగడం, మౌలిక సదుపాయాల కల్పన విస్తరించడం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా మెట్రో రైల్ నెట్‌వర్క్, సరికొత్త ఎక్స్‌ప్రెస్‌వేల అనుసంధానత కారణంగా హై ఇన్కమ్ ప్రొఫెషనల్స్, ఇన్వెస్టర్లు లగ్జరీ ఇళ్లను ఒక దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్