Thursday, May 28, 2026 10:14 PM
Thursday, May 28, 2026 10:14 PM

కష్టపడిన వారికి గుర్తింపు కష్టమేనా..?

వైసీపీ ఐదేళ్ల పాలనలో చాలా మంది టీడీపీ నేతలు భయపడిన మాట వాస్తవం. నియంత పాలనను తలపించిన జగన్ సర్కార్‌లో టీడీపీ నేతలు బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోయారు. కొందరు నేతలైతే.. సైలెంట్‌గా పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు కూడా. చివరికి చంద్రబాబు ముందస్తు ఎన్నికల ప్రకటన, ఒంగోలు మహానాడు తర్వాత నుంచే కార్యకర్తలు ఎదురు తిరగటంతో.. వారి అండతో నేతలు కూడా బయటకు వచ్చారు. అయితే నాటి వైసీపీ పాలనను నిలువునా ఎండగట్టింది మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే. వైసీపీ పరిపాలనలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను ప్రతి రోజూ ప్రజల ముందు వివరించింది ఆ ఇద్దరు మాత్రమే. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ నేతలతో ధైర్యంగా పోరాటం చేసి.. ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు కూడా.

Also Read : మాజీ సీఎం అరెస్ట్ కు రంగం సిద్దం..?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ మంత్రులతో, ముఖ్య నేతలతో రాజకీయంగా దైర్యంగా పోరాడిన ఇద్దరు నేతలను టీడీపీ అధిష్ఠానం పూర్తిగా పక్కన పెట్టడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి మాత్రం నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు కూడా. ఆ ఇద్దరిలో ఒకరు ఆర్థిక వేత్త జీవీ రెడ్డి, మరొకరు తిరుపతికి చెందిన ఎన్.బీ.సుధాకర్ రెడ్డి. ప్రస్తుతం ఈ ఇద్దరి గురించి తెలుగుదేశం పార్టీ మహానాడులో జోరుగా చర్చ జరుగుతోంది. జీవీ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి.. హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. సుధాకర్ రెడ్డి మాత్రం.. మరోసారి సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు టీడీపీ నేతలే భయపడ్డారు. సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి అనుచరులు దాడులు చేసినా కూడా.. కనీసం వారికి మద్దతు ఇచ్చేందుకు కూడా టీడీపీ నేతలు ముందుకు రాలేదు. కానీ సుధాకర్ రెడ్డి మాత్రమే పెద్దిరెడ్డితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించారు. ఒకదశలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్సెస్ సుధాకర్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలనపై విమర్శనాత్మక వీడియోలు చేయడం ప్రారంభించారు. ఆ వీడియోలను వివరాలను గమనించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాల ద్వారా సుధాకర్ రెడ్డిని పిలిపించి.. 2020లో టీడీపీరాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. నిజానికి అప్పటికి సుధాకర్ రెడ్డికి పార్టీ సభ్యత్వం కూడా లేదు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె.నారాయణ స్వామి, విజయసాయి రెడ్డి, ఆర్ కె రోజా తదితరులపై ఘాటైన విమర్శలను ఆధారాలతో చేశారు.

Also Read : మహానాడులో చారిత్రాత్మక ఘట్టం.. తొలిసారి ట్రాన్స్‌ జెండర్ స్పీచ్..!

అప్పట్లో చిత్తూరు జిల్లాలో చాలామంది టీడీపీ నాయకులు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్న సమయంలో సుధాకర్ రెడ్డి మాత్రం.. ధైర్యంగా నిలబడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వకుండా.. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన చెవిరెడ్డి భాస్కర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన డాలర్ దివాకర్ రెడ్డిని తుడా చైర్మన్‌గా నియమించారు. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా సుధాకర రెడ్డిని తప్పించారు. అంతకు ముందు టీవీ చానల్స్‌లో టీడీపీ తరఫున డిబేట్‌లకు హాజరైన సుధాకర రెడ్డి, తన వాగ్దాటితో వైసీపీకి చుక్కలు చూపించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుధాకర్ రెడ్డి ఎక్కడా కనిపించటం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, బంధువులకు, సన్నిహితులకు లెక్కలేనన్ని బెదిరింపులు వచ్చాయి. అయినా సరే సుధాకర్ రెడ్డి మాత్రం వెనకడుగు వేయలేదు.

మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఆ పార్టీకి చుక్కలు చూపించటంలో జీవీ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రతి రోజు టీవీ డిబేట్లు, ప్రెస్ మీట్‌లు, సోషల్ మీడియా వేదికగా వైసీపీ తీరును ప్రజల్లో ఎండగట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అయితే అధికారులు మాత్రం ఆయన మాట లెక్క చేయలేదు. ఇదే విషయంపై పార్టీ, ప్రభుత్వ పెద్దలకు పదే పదే ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం రాలేదు. దీంతో విసిగిపోయిన జీవీ రెడ్డి.. పదవి చేపట్టిన నాలుగు నెలలకే రాజీనామా చేయడంతో పాటు.. పదవికి కూడా గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు.

Also Read : మోదీ సర్కార్‌కు పుష్కరం.. బీజేపీ భారీ ప్లానింగ్..!

నిజానికి ఈ ఇద్దరూ పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదు. ఆ ఇద్దరు కూడా కేవలం జగన్ మీద కోపంతో పాటు.. వైసీపీ పెద్దలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ఎదిరించేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. ఏది ఏమైనా వైసీపీని రాజకీయంగా చీల్చి చెండాడిన వారికి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అధికారం కోసం విధ్వంసం.....

బాల్క సుమన్.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్...

ఏపీ మైనింగ్ కుంభకోణంపై...

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా...

విరాళంలో వేమిరెడ్డి దంపతుల...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

2029 ఎన్నికల పై...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో...

మోదీ సర్కార్‌కు పుష్కరం.....

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో...

మన టార్గెట్.. జెన్...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

పోల్స్