Friday, September 18, 2026 03:43 AM
Friday, September 18, 2026 03:43 AM

భారత్‌ లోకి కియా క్రేజీ కారు..? అనంతపురంలో తయారి స్టార్ట్..?

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియాలో తన ప్రీమియం ఎస్యూవీ మార్కెట్‌ ను భారీగా విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఎంతో పాపులర్ అయిన 7 సీటర్ ఎస్యూవీ కియా సొరెంటో బాడీషెల్ తాజాగా భారత్ లో ఓ ట్రక్ పై కనపడింది. ఒక ఫ్లాట్‌ బెడ్ ట్రక్కుపై ఈ ఎస్యూవీ బాడీషెల్‌ ను తరలిస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో, రాబోయే కొన్ని నెలల్లోనే ఈ కారు భారత్‌ లో లాంచ్ కానుందనే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రోడ్డుపై కనిపించిన కియా సొరెంటో బాడీషెల్ ఇంకా బాడీఇన్ వైట్ స్టేజ్‌ లోనే ఉంది.

Also Read : కియా కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఏకంగా రూ.2.70 లక్షల వరకు..!

అంటే కేవలం కారు ప్రధాన నిర్మాణం, డోర్లు, బోనెట్ మరియు టెయిల్‌ గేట్ మాత్రమే అమర్చి ఉన్నాయి. దీనిని బట్టి కియా సంస్థ ఈ ప్రీమియం కారును విదేశాల నుండి పూర్తిగా తయారు చేసి కాకుండా, సీకేడీ (Completely Knocked Down) రూట్‌ లో భారత్‌ కు తీసుకురాబోతోందని స్పష్టమవుతోంది. అంటే విడిభాగాలను విదేశాల నుండి తెచ్చి, కియా ఇండియా ప్లాంట్‌ లోనే దీనిని లోకల్‌ గా అసెంబుల్ చేయనున్నారు. గ్లోబల్ మార్కెట్ స్టాండర్డ్స్ తరహాలోనే ఇండియా-స్పెక్ కియా సొరెంటో కూడా రాబోతోంది.

Also Read : మహానాడులో చారిత్రాత్మక ఘట్టం.. తొలిసారి ట్రాన్స్‌ జెండర్ స్పీచ్..!

ఇందులో పవర్‌ ఫుల్ ఎస్యూవీ స్టైలింగ్‌ తో పాటు షార్ప్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌ లు, వర్టికల్ స్టైల్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, రూఫ్ రైల్స్ మరియు భారీ అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. లోపల క్యాబిన్ విషయానికి వస్తే.. 3 వరుసల సీటింగ్ లే అవుట్‌ తో రానుంది. ఇక ఫీచర్ల పరంగా ఈ కారులో డ్యూయల్ 12.3-ఇంచ్ డిస్‌ ప్లేలు, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, పనోరమిక్ సన్‌ రూఫ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా మరియు లెవెల్-2 ఏడీఏఎస్ వంటి గ్లోబల్ లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ కారు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 35 లక్షల నుండి రూ. 45 లక్షల పరిధిలో ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్