ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోందనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న బన్నీ.. జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన అట్లీతో జతకట్టడంపై అటు ఇండస్ట్రీ వర్గాలలో, ఇటు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన బడ్జెట్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పై ఒక సంచలన గాసిప్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
Also Read : సిద్దు అవుట్.. డీకే ఇన్.. రూట్ క్లియర్..!
ఈ గాసిప్ ప్రకారం.. దర్శకుడు అట్లీ కేవలం అల్లు అర్జున్ మాస్ ఇమేజ్‌ను మాత్రమే కాకుండా, ఆయనకున్న గ్లోబల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. ఈ సినిమాను హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్ లో నిర్మించడానికి ప్లాన్ చేస్తుండగా, దీని బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్ల పైమాటే అని వినికిడి. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ కు ఏకంగా రూ. 150 కోట్ల నుండి రూ. 180 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.
Also Read : ఆమె సినీ కెరీర్ ను నాశనం చేసిన అండర్ వరల్డ్
ఒకవేళ ఇదే గనుక నిజమైతే, భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే టాప్ హీరోల సరసన అల్లు అర్జున్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయం. మరో ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే.. ఈ సినిమా కథ కేవలం రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా, రెండు వేర్వేరు కాలాల నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందట. ఇందులో అల్లు అర్జున్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో కనిపిస్తాడని, అందులో ఒకటి వింటేజ్ లుక్ కాగా, మరొకటి అత్యంత స్టైలిష్ మోడ్రన్ లుక్ అని ఇండస్ట్రీ టాక్.

