Thursday, May 7, 2026 04:03 PM
Thursday, May 7, 2026 04:03 PM

రోహిత్, కోహ్లీలతో కలిసి.. లక్నో స్టార్ ప్లేయర్ సంచలన కామెంట్స్..!

భారత క్రికెట్‌ లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువ క్రికెటర్లకు వారు ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్. తాజాగా లక్నో సూపర్ జాయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన మనసులోని ఒక పెద్ద కోరికను బయటపెట్టాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ లో రోహిత్, కోహ్లీలతో కలిసి టీమిండియా తరపున ఆడి, కప్ గెలవడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నాడు. ఒక ఇంటర్వ్యూలో ప్రిన్స్ యాదవ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ నాయకత్వం, విరాట్ కోహ్లీ అనుభవం టీమిండియాకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు.

Also Read : లోకేష్ సంచలన నిర్ణయం, ఫ్యాన్సీ విధానాలకు గుడ్ బై..!

2027 వరల్డ్ కప్ గెలవాలన్నది నా కల. అది కూడా రోహిత్ భాయ్, విరాట్ భాయ్ లాంటి దిగ్గజాల సమక్షంలో జరిగితే ఆ కిక్కే వేరు అంటూ కామెంట్ చేసాడు. వారి అపారమైన అనుభవం, నాయకత్వ లక్షణాలు జట్టుకు కొండంత అండగా నిలుస్తాయి. వారి నుంచి ఎంతో నేర్చుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను అని ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. లక్నో సూపర్ జాయింట్స్ తరపున తన ప్రతిభను చాటుకుంటున్న ప్రిన్స్ యాదవ్, అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు.

Also Read : వైరల్ అవుతున్న కార్ నెంబర్.. ముందే ఉహించాడా..!

తన పేస్ మరియు లైన్ అండ్ లెంగ్త్‌ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ప్రిన్స్, ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్‌ లోనూ రాణిస్తున్నాడు. 2027 ప్రపంచకప్ నాటికి భారత జట్టులో చోటు సంపాదించుకోవడమే తన తదుపరి లక్ష్యమని స్పష్టం చేశాడు. ప్రిన్స్ యాదవ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ ఈ యంగ్ ప్లేయర్ వ్యాఖ్యలకు ఫిదా అవుతున్నారు. 2027 నాటికి రోహిత్, కోహ్లీ ఫిట్‌ గా ఉండి జట్టులో కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారినప్పటికీ, ప్రిన్స్ యాదవ్ లాంటి యువకులు వారిని స్ఫూర్తిగా తీసుకోవడం భారత క్రికెట్‌ కు శుభపరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆపరేషన్ సుమతి.. టార్గెట్...

“ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి...

లోకేష్ మరో రాయల్...

ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా...

బ్రేకింగ్: టీడీపీ సంచలన...

ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

బ్రేకింగ్: నేడే విజయ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది....

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

పోల్స్