Monday, June 22, 2026 11:07 AM
Monday, June 22, 2026 11:07 AM

ఎన్టీఆర్ – నీల్.. డ్రాగన్ మల్టీవర్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో రాబోతున్న డ్రాగన్.. సినిమా గురించి ఏ వార్త వచ్చినా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా ఫిలిం నగర్ నుంచి ఒక క్రేజీ గాసిప్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్‌ తో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ఓ మెయిన్ రోల్‌ లో కనిపించబోతున్నారని టాక్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ – తారక్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Also Read : లోకేష్ మరో రాయల్ గోల్.. తమిళనాడు తర్వాత ఏపీలోనే..!

నీల్ సినిమాలో చరణ్ ఒక పవర్‌ ఫుల్ రా ఆఫీసర్ గా గెస్ట్ రోల్ చేయబోతున్నారని సమాచారం. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు సాగే ఈ క్యామియో రోల్ సినిమాకే హైలైట్‌ గా నిలుస్తుందట. అంతేకాకుండా, నీల్ తన మల్టీవర్స్‌ ను మరింత విస్తరిస్తూ, చరణ్ పాత్ర ద్వారా తన తదుపరి సినిమాలకు లింక్ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం చరణ్ మాత్రమే కాదు, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఒక బాలీవుడ్ స్టార్‌ ను తీసుకువస్తున్నట్లు సమాచారం.

Also Read : బ్రేకింగ్: టీడీపీ సంచలన నిర్ణయం.. వర్మపై వేటు..!

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం, యానిమల్ లో తన నటనతో మెప్పించిన అనిల్ కపూర్ లేదా క్రేజీ స్టార్ షాహిద్ కపూర్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌ గా కనిపించబోతున్నారట. మొదట ఈ పాత్ర కోసం టొవినో థామస్‌ ను అనుకున్నప్పటికీ, మరింత పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ స్టార్స్‌ తో నీల్ చర్చలు జరుపుతున్నారట. ఇక సినిమాలో అలియా భట్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని మేకర్స్ నుండి హింట్ వచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పవన్ కు ఆ...

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్...

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

పోల్స్