Wednesday, September 23, 2026 12:49 AM
Wednesday, September 23, 2026 12:49 AM

ఇంట్రస్టింగ్ గా సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు..!

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్, ఆయన భార్య సంగీత ల విడాకుల ఉదంతం మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. వీరిద్దరి విడాకుల పిటిషన్‌పై చెంగల్పట్టు జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో నేడు కీలక విచారణ జరగబోతోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ గత ఏడాది డిసెంబర్ నెలలోనే సంగీత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Also Read : ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

తన భర్త విజయ్ నుండి అధికారికంగా విడాకులు కావాలంటూ సంగీత గత ఏడాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివాహం జరిగిన సుదీర్ఘ కాలం తర్వాత ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను, రాజకీయ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత ఏడాది దాఖలైన ఈ పిటిషన్‌పై కోర్టు ఇప్పటికే పలుమార్లు పరిశీలన జరపగా, నేడు జరగబోయే విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇరు వర్గాల లాయర్లు నేడు కోర్టుకు హాజరు కానున్నారు.

Also Read : పొగాకు రైతులపై జగన్‌ మొసలి కన్నీళ్లు..!

తమిళనాడులో అత్యంత ప్రజాదరణ ఉన్న స్టార్ హీరోగా, ఆపై ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కేసు కావడంతో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు పరిసరాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ విచారణ సందర్భంగా కోర్టు ఇరు పక్షాలకు ఎలాంటి సూచనలు చేయబోతోంది, కౌన్సిలింగ్ ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ విడాకుల కేసు తాజా అప్‌డేట్ల కోసం అటు కోలీవుడ్ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాలు సైతం నిశితంగా గమనిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని...

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా...

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

పోల్స్