Wednesday, May 6, 2026 07:01 PM
Wednesday, May 6, 2026 07:01 PM

వైరల్ అవుతున్న కార్ నెంబర్.. ముందే ఉహించాడా..!

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’.. టీవీకే సంచలన విజయం సాధించిన‌ వేళ, సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విజయ్ 2026లో ముఖ్యమంత్రి అవుతారని రెండేళ్ల క్రితమే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం 2024లో విడుదలైన ‘G O A T’ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలోని ఓ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ కావడమే. ఈ క్లిప్‌ను నటుడు, సంగీత దర్శకుడు ప్రేమ్‌జీ అమరన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో విజయ్ ఒక కారులో కూర్చుని ప్రేమ్‌జీతో సరదాగా మాట్లాడుతుంటారు. అయితే, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే.

Also Read : బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్.. బాలీవుడ్ స్టార్లతో పాన్ ఇండియా లెక్కలు..!

సరిగ్గా రెండేళ్ల క్రితం విజయ్ రాజకీయ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా సినిమాలు తగ్గించినా విజయ్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. విజయ్ చివరగా నటించిన సినిమా జన నాయగన్. అయితే ఆ సినిమా విడుదల కాకుండా డిఎంకె సర్కార్ బ్రేకులు వేసింది. జన నాయగన్ విషయంలో సెన్సార్ బోర్డు ఎన్నో అడ్డంకులు కూడా చెప్పింది. దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. విజయ్ గెలిచిన తర్వాత జన నాయకన్ కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నాను. ఇదే సమయంలో క్రితం నాటి ‘G O A T’ సినిమా గురించి ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది.

Also Read : ఇన్ అండ్ అవుట్.. ముహుర్తం ఫిక్స్..!

‘G O A T’ సినిమాలో విజయ్ సొంతంగా ఓ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఆ కారు పైన ‘TN 07 CM 2026’ అని స్పష్టంగా కనిపిస్తుంది. దీని అర్థం ‘తమిళనాడు, చీఫ్ మినిస్టర్, 2026’ అని వ్యాఖ్యానిస్తూ, “అప్పుడే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారు” అని ప్రేమ్‌జీ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు వెంకట్ ప్రభు నవ్వుతున్న ఎమోజీలతో బదులిచ్చారు. 2024లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజ‌యాన్ని అందుకుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

నిజంగా కేసీఆర్ కు...

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష...

పోల్స్