రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రంగాన్ని మరియు ఆక్వా రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఏపీ ఆక్వా రంగాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైన లేఖ రాశారు. అమెరికా విధించిన సుంకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ నుండి జరిగే సుమారు రూ.25,000 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు తీవ్ర ముప్పులో పడ్డాయని సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : ముగ్గురు సీఎంల ముద్దుల కాంట్రాక్టర్..!
ఈ అంతర్జాతీయ పరిణామాల వల్ల రాష్ట్రంలోని 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలతో పాటు, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 30 లక్షల మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆక్వా రంగానికి ఊతమిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆక్వా రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రొయ్యల మేత ధరపై కేజీకి రూ.9 రూపాయలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
Also Read : హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయా..?
దీనితో పాటు, ఆక్వా సాగును లాభసాటిగా మార్చేందుకు మరియు పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు వీలుగా ప్రతి యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ.1.50 లకే అందిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత సంక్షోభం నుండి పూర్తిగా బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పనిసరని, అమెరికా విధిస్తున్న సుంకాల శాతాన్ని తగ్గించేలా ఆ దేశంతో ఉన్నత స్థాయి దౌత్యపరమైన చర్చలు జరపాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేవలం అమెరికా మార్కెట్ పైనే ఆధారపడకుండా, ఏపీ ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Also Read : ముగ్గురు సీఎంల ముద్దుల కాంట్రాక్టర్..!
రష్యా, యూరోపియన్ యూనియన్, మరియు ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు భారత ఆక్వా ఎగుమతులను పెద్ద ఎత్తున పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితో పాటు, దేశీయంగా రొయ్యల వినియోగాన్ని పెంచేందుకు ఆయన ఒక వినూత్నమైన ప్రతిపాదనను కేంద్రం ముందుంచారు. భారత సాయుధ దళాల రోజువారీ ఆహార మెనూలో రొయ్యలను ఒక భాగంగా చేర్చాలని, దీనివల్ల సైనికులకు అధిక ప్రోటీన్లు అందడమే కాకుండా దేశీయ మార్కెట్‌లో ఆక్వా ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని చంద్రబాబు లేఖలో వివరించారు.

