Sunday, September 20, 2026 04:59 PM
Sunday, September 20, 2026 04:59 PM

షాకింగ్.. భయపడి పారిపోతున్న రష్యా ఆర్మీ..!

గత ఐదేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇంతకాలం ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమిస్తూ, ఆయుధ బలంతో దూకుడు ప్రదర్శించిన రష్యన్ ఆర్మీ.. ఇప్పుడు యుద్ధభూమిలో తీవ్రమైన గందరగోళాన్ని ఎదుర్కొంటోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంతర్జాతీయ థింక్ ట్యాంకులు, ది ఎకనామిస్ట్ వార్ ట్రాకర్ విడుదల చేసిన తాజా శాటిలైట్ డేటా ప్రకారం, 2023 అక్టోబర్ తర్వాత రష్యా తన ఆధీనంలో ఉన్న భూభాగాలను నికరంగా కోల్పోవడం ఇదే మొదటిసారి.

Also Read : హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయా..?

యుద్ధ ఫ్రంట్ లైన్స్ లో ఉక్రెయిన్ సైన్యం చేస్తున్న భీకర దాడులు, వ్యూహాత్మక ఆపరేషన్ల వల్ల రష్యా సైన్యంలో భయాందోళనలు మొదలయ్యాయని, పలు ప్రాంతాల్లో రష్యా సైనికులు ప్రాణభయంతో వెనకడుగు వేస్తూ పారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధభూమిలో రష్యా ఆర్మీ తిరోగమనానికి ఉక్రెయిన్ అనుసరిస్తున్న సరికొత్త డ్రోన్ వ్యూహం ప్రధాన కారణమని తెలుస్తోంది. ఉక్రెయిన్ తన అధునాతన డ్రోన్లను ఫ్రంట్‌ లైన్‌ కు చాలా మైళ్ల వెనుక నుండే ఆపరేట్ చేస్తోంది.

Also Read : భూమన ఫ్యామిలీకి షాక్.. హడావుడి తగ్గుతుందా..?

దీనివల్ల రష్యన్ సైనిక విభాగాలు లేదా వారి భారీ యుద్ధ ట్యాంకులు ముందుకు కదలాలని చూసినా, లేదా కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించినా.. అవి వెంటనే ఉక్రెయిన్ డ్రోన్ల రాడార్లకు చిక్కి ఈజీ టార్గెట్లుగా మారిపోతున్నాయి. ఈ డ్రోన్ దాడుల దాటికి తట్టుకోలేక, భారీగా ప్రాణాలు కోల్పోతుండటంతో రష్యా బలగాల మోరల్ పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. సైన్యాన్ని సురక్షితంగా ఉంచడం పుతిన్ కమాండర్లకు సైతం సాధ్యం కాకపోవడంతో, సైనికులు యుద్ధాన్ని వదిలి వెనక్కి పారిపోతున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితి చెప్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్