Monday, July 20, 2026 04:34 PM
Monday, July 20, 2026 04:34 PM

తమ్మినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ పత్రాలతో కాజేసిందుకు జరిగినట్లు ఆరోపణలున్న కుట్రలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ అలియాస్ నాని, తమ్మినేని వాణి పేర్లు నిందితుల జాబితాలో చేరాయి. శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ వ్యవహారంలో మొత్తం 13 మంది ప్రమేయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఎనిమిది మందిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. మిగిలిన వారిపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి వెల్లడించారు.

Also Read : ఉత్తరాంధ్రకు కొత్త యుగం.. ఆగస్టు 1న భోగాపురం ప్రారంభం

చాపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలోని సర్వే నంబరు 35/13లో ఉన్న 84, 85, 86 ప్లాట్లను ఫిర్యాదుదారుడి తండ్రి తండ్రీకట్ట కనక లింగేశ్వరరావు 1988, 1992 సంవత్సరాల్లో చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటుండటంతో ఆ స్థలం చాలాకాలంగా ఖాళీగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రూ.3 నుంచి రూ.4 కోట్ల విలువైన ఆ భూమిని కాజేసేందుకు పథకం వేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.

అసలు యజమాని జీవించి ఉండగానే ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. దాని ఆధారంగా తప్పుడు కుటుంబ సభ్యులు, వారసత్వ ధ్రువీకరణ పత్రాలను రూపొందించి.. అనంతరం రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా భూమిపై హక్కులు పొందేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్థలంలో ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నించగా అసలు యజమాని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించడం తో నకిలీ పత్రాల వ్యవహారం బయటపడింది.

Also Read : పదవి కావాలంటే.. పని చేయాల్సిందే.. బాబు వార్నింగ్..!

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. A5 తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ అలియాస్ నాని, A6 మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, A7 తమ్మినేని వాణి ఇతర నిందితులతో కుమ్మక్కై తప్పుడు, నకిలీ పత్రాలను సృష్టించి సుమారు రూ.3 కోట్ల విలువైన ఖాళీ స్థలాలను అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదులోని ఆరోపణల ప్రకారం A1 నుంచి A4 వరకు ఉన్న నిందితులు A5, A6, A7 సహకారంతో డాక్యుమెంట్ రైటర్ A12 ద్వారా తప్పుడు పత్రాలను తయారు చేయించినట్లు ఆరోపణలున్నాయి. A13గా పేర్కొన్న సబ్ రిజిస్ట్రార్ సహకారంతో సంబంధిత ఆస్తికి తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేలా ప్రయత్నించినట్లు ఫిర్యాదులో ఆరోపించినట్లు పోలీసులు వివరించారు.

ఈ కేసులో అడబాల రజని, తెలుగు సతీష్‌కుమార్, సాలిపిల్లి లక్ష్మణరావు, ముదాడ్ల ఉపేంద్రకుమార్, జెగురిపాటి ఉపేంద్రరావు, మామిడి గోపాలకృష్ణ, సాంబాన సాంబశివరావు, డాక్యుమెంట్ రైటర్ కూన పెద్దిరాజును పోలీసులు అరెస్టు చేశారు. తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాన్ నాని, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తమ్మినేని వాణితో పాటు మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగుతోందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కేసుకు సంబంధించి నకిలీ రబ్బరు స్టాంపులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూములు కొనుగోలు చేసే ముందు భూ రికార్డులు, యాజమాన్య పత్రాలు, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలను సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా ధృవీకరించుకోవాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. నకిలీ పత్రాల సృష్టి, ప్రభుత్వ రికార్డుల తారుమారు, భూకబ్జాలకు పాల్పడే వారిపై ” కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

కాదంబరి జెత్వాని కేసులో...

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై...

అమర్ రాజాకు ఏపీ...

ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర...

ఏపీలో కొత్త కోవిడ్...

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19కు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్...

పోల్స్