Wednesday, August 12, 2026 01:16 PM
Wednesday, August 12, 2026 01:16 PM

డిప్యూటి సిఎం భార్యపై సంచలన ఆరోపణలు..!

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్కపై వచ్చిన లంచం ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగిని, ఐఎన్‌టీయూసీ అనుబంధ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్.కె. ప్రసన్నకుమారి తీవ్ర ఆరోపణలు చేశారు. తన రూ. 40 లక్షల రిటైర్మెంట్ బకాయిల విడుదలకు గానూ నందిని విక్రమార్క 10 శాతం కమీషన్ కింద రూ. 4 లక్షలు డిమాండ్ చేశారని ఆమె బహిరంగంగా ఆరోపించారు.

Also Read : ఆ రాష్ట్రానికి శాపంగా మారిన పులులు..?

సచివాలయంలో లేదా ప్రభుత్వ విభాగాల్లో ఫైళ్లు కదలాలన్నా, పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలన్నా 6 నుంచి 10 శాతం వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబర్‌పేటకు చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటూ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులపై ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం ప్రభుత్వ పారదర్శకతను దెబ్బతీస్తుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read : వెస్టిండీస్‌ క్రికెట్ కు కోలుకోలేని దెబ్బ..!

ఈ మొత్తం వ్యవహారంపై ఒక నిర్దిష్ట కాలపరిమితిని విధించి, నిష్పక్షపాతంగా స్వతంత్ర సంస్థతో ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను రేవంత్ కోరారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు మరియు బిల్లులను ఎలాంటి కమీషన్లు లేదా లంచాలు లేకుండా త్వరితగతిన విడుదల చేసేలా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ లంచం ఆరోపణలపై ధైర్యంగా ముందుకు వచ్చిన ప్రసన్నకుమారిని లేదా ఇతర ఉద్యోగులను ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం ఎలాంటి వేధింపులకు గురిచేయకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శాంతిభద్రతలపై సీఎం నేడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా...

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

పోల్స్